భారతీయులు ఉపాధి నిమిత్తం దేశం దాటుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆలా దేశం దాటే సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి చదువుకున్నవారు అమెరికాకు వెళ్తే ఎక్కువశాతం మంది చదువు కొని వారు ఉపాధి నిమిత్తం అరబ్ దేశాలకు వెళ్తారు. అలానే చాలామంది కువైట్ కి వెళ్లి అక్కడ బాగా సంపాదించి వెనక్కి వస్తారు. 


అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 లోపు వివాద కారణాలతో మొత్తం 18వేల మంది విదేశీయులను కువైట్ దేశం నుంచి బహిష్కరించింది. కువైట్ బహిష్కిరించిన 18వేల మంది విదేశీయులలో మన భారతీయులు 5వేల మంది ఉన్నారు. అలాగే బహిష్కరించిన 18వేల మందిలో 6వేల మంది మహిళలే ఉన్నారు. అయితే ఆ దేశ హోమ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం సంక్రమణ వ్యాధులు, వలస చట్టాల ఉల్లంఘన, ట్రాఫిక్ ఉల్లంఘనలు, క్రిమినల్ కేసులు, ఇతర కేసుల కారణంగా వివిధ దేశాలకు చెందిన వలసదారులను బహిష్కరించినట్లు పేర్కొంది.  


అయితే కువైట్ బహిష్కరించిన మొత్తం 18వేల మందిలో అత్యధికంగా 5 వేలమంది భారతీయులు ఉండటం గమనార్హం. ఆ తరువాతి స్థానాల్లో 2,500 మంది బంగ్లాదేశీయులు, 2,200 మంది ఈజిప్టియన్స్, 2,100 మంది నేపాలీయులు, 1,700 మంది ఈథియోపియన్లు, 1,400 మంది సిరియన్లు, 1,200 మంది ఫిలిప్పీనోస్ ఉన్నారు. కాగా మరో 50 మంది పురుషులు, 8 మంది మహిళలు బహిష్కరణ కేంద్రంలో ఉన్నట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఆలా ఉన్న ఆ 58 మందిని కూడా మరో మూడు రోజుల్లో స్వదేశాలకు పంపిస్తామని వారు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: