ఇలాంటి నీచులకు ఎంత చెప్పిన ఒకటే.. మీకు పిల్లలు భారమైనప్పుడు కనడం ఎందుకు.. వారిని చిత్రహింసలు పెట్టడం ఎందుకు ? అసలు మీరు మనుషులేనా ? అని అనిపిస్తుంది ఈ ఘటన గురించి తెలిస్తే.. ఓ దారుణమైన ఘటన చైనాలోని తైవాన్ లో జరిగింది. దారుణం దారుణం అనడం కాదు కానీ ఈ ఘటన గురించి తెలిసిన సమయం నుంచి గుండెల్ని పిండేస్తుంది. 


ఇంకా వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతికి మానసిక పరిస్థితి బాగాలేదు.. అలాంటి యువతికి ఆన్లైన్ లో ఓ యువకుడు పరిచయమైయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమ అయ్యింది.. ఇంకా అది కాస్త సహజీవనం అయ్యింది. ఆ సహజీవనానికి ఫలితంగా ఈ గత నెల అక్టోబర్ 8న ఓ బిడ్డ పుట్టింది. అయితే వారి ఆర్ధిక పరిస్థితి బాగాలేదు అందుకని కన్నా బిడ్డని కవర్‌లో కుక్కి పిచ్చి మొక్కలు పెరుగుతున్న పిచ్చి కుక్కలు తిరుగుతున్న ప్రాంతంలో పడేశారు.  


అక్కడే తిరుగుతున్న పిచ్చి కుక్కలాకు ఆ శిశువు కనిపించింది. అప్పటికే రక్తపు మరకలతో ఉన్న శిశువును బ్రతికుండంగానే ఆ పిచ్చి కుక్కలు పీక్కుతిన్నాయి. అయితే ఆ పిచ్చి ముక్కలపై పడి ఉన్న శిశువు శరీర భాగాలు చూసి హడలిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 


అయితే ఆ శిశువు ఎవరు ? ఆ బిడ్డను ఎందుకు పడేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చెయ్యగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తల్లిదండ్రులను విచారించగా ఆర్ధిక పరిస్థితి బాగోలేకనే బిడ్డని పడేసినట్టు తెలిపారు. ఈ మాటలు విన్న పోలీసులు వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. పిల్లల్ని పోషించలేనప్పుడు కనడం ఎందుకు అని ప్రశ్నించారు.. మీరు పోషించలేకపోతే.. పిల్లలు లేని వారికీ ఇవ్వాలి ఆలా పడేస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ శిశువు తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: