అమెరికాలో భారతీయులకు 15ఏళ్లు జైలు శిక్ష ? ఏంటి అని అనుకుంటున్నారా ? ఇంకా ఏ శిక్ష పడలేదండి. కానీ కేసు నిరూపణ అవుతే మాత్రం 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. తప్పుడు వివాహ పత్రాలతో యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ ను మోసగించిన కేసులో ఇద్దరు భారతీయ సోదరులు కోర్టులో విచారణ ఎదురుకుంటున్నారు. 


రాజిందర్, మఖన్ సింగ్ అనే సోదరులు 2011లో ఒక మహిళతో అబద్దపు పెళ్లి చేసుకొని మోసం చేసారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అయితే వివాహ మోసం పథకం ఆరోపణలపై అమెరికాలోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ నిన్న మంగళవారం ఈ సోదరులపై ఆరోపణలు చేసింది. 


కోర్టు వివరాల ప్రకారం... ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఎగవేసే ఉద్దేశ్యంతో డీహెచ్ అనే ఓ మహిళకు మఖన్ సింగ్ కొంత డబ్బు ఇచ్చి తన సోదరుడు రాజిందర్‌తో అబద్ధపు పెళ్లి జరిపించాడు. అయితే అనంతరం వారికి నిజంగా పెళ్లైందని తప్పుడు ధృవపత్రాలు సృష్టించి యూఎస్ పౌరసత్వనికి, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు ఇచ్చారు. 


ఆ తరువాత ఇద్దరు సోదరులు కలిసి దంపతుల పేరుపై జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా కారు ఇన్సూరెన్స్ చెల్లించడం సహా ఇతర ప్రయోజనాల కోసం లావాదేవీలు జరిపారు. అయితే ఇందులో భాగంగానే సీఐఎస్‌కు రాజిందర్‌ మార్చి 11, 2016న తప్పుడు సమాచారం ఇచ్చినట్లు రుజువైంది. 


అబద్దపు భార్య డీహెచ్‌తో వేరుగా ఉంటున్న తామిద్దరం కలిసే ఉంటున్నట్లు తప్పుడు చిరునామా సమర్పించాడు అని ఇలా మోసపూరిత వివాహంతో సీఐఎస్‌ను తప్పుదోవ పట్టించారని కోర్టులో ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు సోదరులపై కనుక రుజువైతే 15 ఏళ్ల జైలు, రూ. 3 కోట్ల 60లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మరి ఈ ఆరోపణలు నిజమవుతాయా లేదా అనేది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: