ఈ మధ్యకాలంలో అత్యాచారాలు ఎక్కువ కదండీ... అందుకే ఈ 25 ఏళ్ళ శిక్ష.. అయినా ఆడవారిపై అత్యాచారాలు చేసే నీచులకు 25 ఏళ్ళ జైలు శిక్ష కూడా తక్కువే కదా.. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. సహాయం చేసే వంకతో ఓ భారతీయుడు న్యూయార్క్‌లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అందుకు గాను అతనికి 25 ఏళ్ళ జైలు శిక్ష పడింది. 

 

భారత దేశానికి చెందిన అశోక్ అనే వ్యక్తి వృత్తిరీత్యా న్యూయార్క్‌లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే క్వీన్స్‌కు చెందిన ఓ మహిళతో అశోక్ సింగ్ కి పరిచయం ఏర్పడింది. అయితే ఆ సమయంలో ఆమె క్వీన్స్ పరిసర ప్రాంతాల్లో నివాసముండేందుకు అద్దె ఇంటి కోసం వెతుకుతుంది. 

 

ఈ విషయం తెలుసుకున్న అశోక్ సింగ్ ఆమెకు సహాయం చేస్తా అని ముందుకు వచ్చాడు. అలానే ఆమె కోసం ఓ ఇంటిని కూడా వెతికి పెట్టాడు. ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆమెతో కాస్త చనువుగా ఉండేవాడు. ఆ సమయంలోనే ఓ రోజు షాపింగ్ వెళదామని బయటకు వెళ్లి.. మద్యం ఇంటికి కావాల్సిన వస్తువులు అన్ని తీసుకొచ్చారు. 

 

అనంతరం అతను మద్యం సేవించి ఆమెను తాగమని బలవంతం చేసాడు. ఆమె నిరాకరించడంతో ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అశోక్ నిద్రపోగా ఆ సమయంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. 

 

అత్యాచారం చేశాడు అని వైద్య పరీక్షలలో తెలియడంతో 2015లో జరిగిన ఈ ఘటన తాజాగా స్థానిక డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణకు వచ్చింది. రెండు వారాల విచారణ అనంతరం అశోక్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. జిల్లా కోర్టు అటార్నీ జాన్ ర్యాన్ మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడు అశోక్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: