చదువు చెప్పాల్సిన ప్రొఫెసర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే విద్యార్ధులు ఏమి చేస్తారు ఇంట్లో చెప్తారు లేదంటే ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేస్తారు. లేదంటే ఆ కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తారు. మరి కాలేజీ ప్రిన్సిపాల్ యాజమాన్యం, పట్టించుకోక పొతే ఏమి చేస్తారు ఇంట్లో చెప్తారు పెద్దలు భయపడి తమ పిల్లలకోసం బయటపడరు. కానీ అమెరికాలో ఓ కాలేజే అమ్మాయిలూ మాత్రం సదరు ప్రొఫెసర్ కి చుక్కలు చూపించారు.

https://twitter.com/nowthisnews/status/1199058423435812864/video/1

భారత సంతతికి చెందిన సహోత్ర సర్కార్ అనే వ్యక్తి ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. పాటాలు చెప్పకుండా నరకం చూపిస్తున్నాడని యూనివర్సిటీ మహిళలు వాపోతున్నారు. గతంలో ఇదే ప్రొఫెసర్ పై లైంఘిక ఆరోపణలు రావడంతో పాటు కొంత మంది విద్యార్ధినిలని నగ్నంగా తనతో ఫోటోలు దిగాలని , బీచ్ లో తనతో ఈత కొట్టాలని వేధించే వాడని తెలియడంతో విధుల నుంచీ తొలగించిన యూనివర్సిటీ మళ్ళీ

 

సహోత్ర ని విధుల్లోకి తీసుకోవడంతో యూనివర్సిటీ మహిళలు ఊగిపోయారు. అతడిని వెంటనే సస్పెండ్ చేయాలి, విధుల్లోకి తీసుకోవద్దు అంటూ సహోత్ర ఉన్న క్లాస్ రూమ్ లోకి వెళ్లి నిరసనలు తెలుపుతూ, గట్టిగా అరుస్తూ  బయటకి వెళ్ళే వరకూ వెంటపడి తరిమారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతడిని మళ్ళీ సస్పెండ్ చేసేవారకూ మా నిరసనలు ఇలానే ఉంటాయని విద్యార్ధినులు యూనివర్సిటీ కి తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: