అమెరికాలో భారత సంతతికి చెందిన యువకుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతూ పెళ్ళికి సిద్దమయ్యాడు. అయితే తన పెళ్లి అందరూ చెప్పుకోవాలని అనుకున్నాడో లేక అందరి పెళ్ళిళ్ళ కంటే కూడా భిన్నంగా తన పెళ్లి ఉండాలని అనుకున్నాడో ఏమో కానీ మొత్తానికి డిఫరెంట్ గా ఆలోచన చేశాడు. అనుకున్నదే తడవుగా భంధువులు అందరికి షాక్ ఇస్తూ తన పెళ్ళికి వెరైటీ గా ఎంట్రీ ఇచ్చాడు.

 

ఈ యువకుడు ఇచ్చిన పెళ్లి ఎంట్రీ ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. పెళ్లి మండపానికి దగ్గరలోని ఓ ఖాళీ ప్రాంతంలో భంధువులు అందరిని ఉంచాడు. అందరూ వీక్షిస్తున్న సమయంలో ఆకాశంలో సుమారు 500 అడుగుల ఎత్తు నుంచీ స్కై డ్రైవ్ ద్వారా నేలమీదకి దిగాడు. అతడు వస్తున్న క్రమం చూసి అందరూ షాక్ అయ్యారు. కేరింతలు కొడుతూ పెళ్లి కొడుకుకి స్వాగతం తెలిపారు.

Image result for indian-groom-skydives-into-his-baraat-at-wedding-in-mexico

సుమారు 500 వందల మంది ఈ పెళ్ళికి హాజరు కాగా అందులో సగానికి సగం మంది అక్కడే ఉన్నారు. అతడిని వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దాంతో అది కాస్తా వైరల్ అయ్యి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. నెటిజన్లు సూపర్ ఎంట్రీ అంటూ పొగుడుతుంటే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం కొత్త పెళ్లి కొడుకువి కుదురుగా ఉండూ ఉంటూ తిట్టిపోస్తున్నారు. మొత్తానికి కొత్త పెళ్లి కొడుకు కోరిక తీరినట్టే అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: