అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలని, తన జీవితాన్ని గొప్పగా మలుచుకోవాలని కలలుకన్న భారతీయ విద్యార్ధి  కలలు కలలుగానే మిగిలిపోయాయి. గొప్పవాడై జీవితంలో స్థిరపడుతాడని భావించిన తల్లి తండ్రులు పుట్టెడు శోకం మిగిలింది. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో మైసూర్ కి చెందిన ఓ యువ విద్యార్ధి మరణించాడు. ఈ ఘటన  అతడి కుటుంభంలో విషాదాన్ని మిగిల్చింది. వివరాలోకి వెళ్తే..

 

మైసూల్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన  అభిషేక్ సుదేశ్ భట్ అనే యువకుడు ఉన్నత చదువుల కోసం తల్లి తండ్రులని ఒప్పించి మరీ అమెరికా వెళ్ళాడు. శాన్ బెర్నార్డియాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ లో ఏంఎస్ చేస్తూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అభిషేక్ పని చేస్తున్న హోటల్ కి వచ్చిన దుండగులు అభిషేక్ తో గొడవ పడ్డారని స్థానిక పోలీసులు విచారణలో తేలింది.

 

దుండగులు కొంతసేపు గొడవ పడిన తరువాత అతడిపై తుపాకీ తో కాల్పులు జరిపారని వెంటనే వారు తెచ్చుకున్న వాహనంలో వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. అయితే ఇది కక్ష పూరితంగా జరిగిన చర్యా లేకా భారతీయులపై గత కొన్నేళ్లుగా అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార హత్యా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే చదువుల్లో ఎంతో ముందుండే అభిషేక్ అందరితో ఎంతో సరదాగా ఉండే వాడుని సన్నిహితులు అంటున్నారు. అతడు పని చేస్తున్న హోటల్ లో సైతం అభిషేక్ అందరిని నవ్విస్తూ ఉండేవాడని సిబ్బంది కన్నీటి పర్యంతమవుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: