కమలా హారిస్.. ఎన్నారైలకు సుపరిచితురాలు ఈమె. మహిళ అమెరికా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సెనెటర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా కమలా హారిస్‌ చరిత్రకెక్కారు. ఈసారి ఏకంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీకి సిద్ధమై భారతీయుల్లో ప్రత్యేకించి ఎన్నారైల్లో ఆశలు పెంచారు.

 

ఇండియన్ ఆరిజన్ మహిళ అమెరికా ప్రెసిడెంట్ అవుతుందా అన్న ఆసక్తి రేపారు. అయితే అంతలోనే కమలా హారిస్ ఆ ఆశలపై నీళ్లు జల్లారు. తాను 2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ఆమె ముగించారు.

అయితే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు డబ్బు కొరతే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

 

ఆమె ఏమంటున్నారంటే.. ‘‘నేను బిలియనీర్‌ను కాదు. సొంత ప్రచారానికి నిధులు సమకూర్చుకునే పరిస్థితుల్లో లేను. ప్రచారం కొనసాగుతున్న కొద్దీ, మనం పోటీ పడటానికి అవరసరమైన నిధులు సేకరించడం కష్టంతో కూడుకున్న పని అంటూ మద్దతుదారులకు చెప్పారు. అయితే న్యూయార్క్‌ మేయర్‌ మైక్‌ బ్లూమ్‌బర్గ్‌ అధ్యక్ష పదవికి రంగంలోకి దిగడంతో కమలా హారిస్ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: