మనిషి అన్నాక మనిషిలానే ప్రవర్తించాలి.. నరరూప రక్షేషుడిలా ప్రవర్తించకూడదు. మనిషి పుట్టాడు అంటే అన్ని రుచులు చూడాలి. ఆలా అని రాక్షసత్వం రుచి చూస్తే పక్కన ఉన్న మిగితా మనుషులు ఘోరంగా బలవుతారు. ఈ నేపథ్యంలోనే ఓ నరరూప రక్షేశుడు భార్యను ఘోరాతి ఘోరంగా కాల్చి చంపాడు ఓ నీచుడు. అయితే మాములుగా ఎవరైనా బాధితులకు న్యాయంగా న్యాయం జరగాలంటే ఎన్నిరోజులు పడుతుందో తెలుసు కదా ? ఏంటి ఆ కేసు ? ఏమైంది అనేది ఇక్కడ చదవండి.  

 

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన లీ హాల్ అనే వ్యక్తి టెన్నెసీలో నివసించేవాడు. అందుడైన లీ అక్కడే ఉండే ట్రేసీ కోజియర్‌ అనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. ఇద్దరు ఘాడంగా ప్రేమించుకున్న కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వీరి ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 

 

దీంతో ఒకరోజు వీరిద్దరూ గొడవపడుతు కోపంలో లీ కారులో కూర్చొని ఉన్న ట్రేసీపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. అంతే పెద్దగా కేకలు వేస్తూ గిలగిల కొట్టుకొని ట్రేసీ అక్కడిక్కడే మరణించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లీని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న అతనిపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. 

 

అప్పటికే అతనికి ఖచ్చితంగా మరణ శిక్ష పడుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే నత్తనడకన నడిచిన ఈ కేసు దాదాపు 28 ఏళ్లపాటు కేసుపై విచారణ జరపగా కోర్టు కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనకు మరణశిక్ష విధిస్తున్నట్టు అయితే అతను ఎలా చావాలి అనుకుంటున్నాడో అలాగే చంపేయండి అని కోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. దీంతో అతను ఎలక్ట్రిక్ ఛైర్ పద్ధతిని ఎంచుకున్నాడు. అలాగే మరణించాడు. ఒక బాధితురాలికి న్యాయం జరగాలి అంటే 28 ఏళ్ళునా.. అమెరికాలోనే ఇన్ని సంవత్సరాలు అంటే ఇంకా మన భారత్ లో బాధితులకు న్యాయంగా న్యాయం జరగాలంటే ఇంకా ఎన్నేళ్లు పడుతుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: