ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కి అమెరికాలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగు పండుగలని అచ్చం తెలుగు నేలపై చేసుకున్నట్లుగా ఎంతో వైభవంగా నిర్వహించడంలో తానా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే సెలవుల రోజుల్లో తానా ప్రతీఏటా అమెరికాలో తమ శాఖలు ఉన్న ప్రతీ రాష్టంలో ఫుడ్ డ్రైవ్ ఏర్పాటు చేస్తుంది. తాన చేపట్టే ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలనుంచీ సైతం విశేష ఆదరణ లభిస్తుంది.

 

ఈ క్రమంలోనే అమెరికాలో ఒరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్ ల్యాండ్ లో తానా కార్యకర్తలు భారీ ఫుడ్ డ్రైవ్ ని ఏర్పాటు చేశారు.ఈ డ్రైవ్ కి చిన్న పిల్లల నుంచే పెద్దవాళ్ళ వరకూ కూడా భారీ స్పందన రావడంతో తానా సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక సాల్వేషన్ ఆర్మీలో నోరూరించే భారతీయ వంటకాలని సిద్దం చేశారు.  ప్రత్యేకంగా తెలుగు వారందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న వేడుకకి స్థానిక ప్రజల సహకారం కూడా తోడయ్యింది.

 

అలాగే అమెరికాలోని అట్లాంటాలో సైతం ఈ ఫుడ్ డ్రైవ్ కి విశేష స్పందన లభించింది. ఈ వేడుకలో సుమారు 8 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు సైతం ఎంతో ఉశ్చాహంగా పాల్గొన్నారని. స్వయంగా చేసిన ఆహారపదార్ధాలు పేదలకి తానా సభ్యులు పంచిపెట్టారని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి తెలిపారు. సుమారు 5000 మందికి సరపడా పదార్ధాలు తయారు చేసినట్టుగా తానా సభ్యులు ప్రకటించారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: