కొత్త ఏడాదిలో ఏ సమస్యలు, ఇబ్బందులు లేకుండా విదేశాల్లో చక్కర్లు కొట్టాలని ఉందా... ? అయితే, మలేసియా మిమ్మల్ని సగర్వంగా ఆహ్వానిస్తోంది. 2020 సందర్భంగా ఏడాది మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దేశాన్ని చుట్టేయవచ్చు. అదెలా అనుకుంటారా..?  ఇండియా, చైనా ట్రావెలర్స్ కోసమే ఆ దేశం ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే...


విదేశీ ప్రయాణమంటే పాస్‌ పోర్ట్‌ తోపాటు.. వీసా కూడా చాలా అవసరం. చాలామంది విదేశాలు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నా.. చివరి క్షణంలో వీసా సమస్య వల్ల ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ ఏడాది మలేసియా వెళ్లేందుకు ఆ సమస్యలు రావు. ఎందుకంటే.. 2020 లో ఆ దేశాన్ని సందర్శించే ప్రయాణికులకు వీసా అక్కర్లేదు. 


స్టార్ ఆన్‌ లైన్ రిపోర్టు ప్రకారం.. వీసా అవసరం లేకుండా ప్రయాణించే పర్యాటకులు తగిన గుర్తింపు కార్డులు చూపించాలి. ఆ దేశంలో ఖర్చుల కోసం తగిన నగదు ఉన్నట్లుగా ఆధారాలు ఇవ్వాలి. మలేషియా ఎందుకు వెళ్తున్నారనేది స్పష్టంగా తెలియజేయాలి. రిటర్న్ టికెట్ కూడా చూపించాలి. రిజిస్టర్ చేసుకున్న మూడు నెలల తర్వాత పర్యాటనకు అనుమతి ఇస్తారు. 


ఈ ఏడాదిలో 15 రోజులు ఆ దేశాన్ని చుట్టి వచ్చేయవచ్చు. ఎలక్ట్రానిక్ ట్రావెల్ రిజిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ ద్వారా మలేసియాలో పర్యటించవచ్చు. అయితే, 15 రోజుల తర్వాత టూర్‌ ను పొడిగించు కోవడానికి అనుమతి ఉండదు. 2020లో విదేశీ పర్యాటకుల సంఖ్య 30 మిలియన్‌ కు చేరాలనేది ఆ దేశం లక్ష్యం. ఈ నేపథ్యంలో జనాభా ఎక్కువగా ఇండియా, చైనాలను లక్ష్యంగా చేసుకుని ఈ మలేసియా ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరి, ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిద్ధమైపోండి. ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే.. సమ్మర్ హాలీడేస్ కల్లా మీకు అనుమతి వచ్చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: