అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన క్రిమినల్, సివిల్ కోర్టులకి జడ్జిలుగా ఇద్దరు భారత సంతతి మహిళలు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. అర్చనా రావు క్రిమినల్ కోర్టుకి నియమితులు కాగా దీపా అంబేకర్ సివిల్ కోర్టుకి న్యాయమూర్తిగా ఎంపిక అయ్యారు. ఇదిలాఉంటే అర్చనా రావు గతంలో న్యూయార్క్ లోని జిల్లా అటార్నీ కార్యాలయంలో సుమారు 17 ఏళ్ళపాటు పనిచేశారు. అంతేకాదు

 

 అర్చనా రావు ఇటీవలే ఫైనాన్షియల్ ప్రాడ్ బ్యూరో చీఫ్ గా నియమితులు అయ్యారుఅమెరికాలోనే పుట్టి పెరిగిన ఆమె  ఫోర్డామ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచీ డాక్టర్ పట్టా తీసుకున్నారు. 2019 జనవరిలో తొలిసారిగా తాత్కాలిక సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.గతంలో ఆమె క్రిమినల్ కోర్టులో కూడా సేవలు అందించారు. అలాగే

 

మరో భారత సంతతి న్యాయమూర్తి దీపా 2018 లో సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు.అంతకు ముందే న్యూయార్క్ నగర మండలిలో సీనియర్ అటార్నీగా సేవలు అందించారు. తాజాగా వీరి ఇద్దరి నియామకం పట్ల అమెరికాలోని తెలుగు సంఘాలు ప్రవాస భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: