ఇరాక్‌లోని బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్ కీలక సైనికాధికారిని కోల్పోయింది. దెబ్బకుదెబ్బ.. మళ్లీ ఇరాన్ అమెరికా మిలిటరీ బేస్‌లపై దాడులు చేసింది. దీంతో అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మన దేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.దీనితో భారత దేశం కూడా అప్రమత్తం అయింది..

 

భారతీయులెవరు ఇరాక్, ఇరాన్, గల్ఫ్ దేశాలకు వెళ్లవద్దని.. విమాన ప్రయాణాలు మానుకోవాలని విదేశాంగ శాఖ హెచ్చరించింది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోమని హెచ్చరించింది. యుద్ధ ప్రభావం మన దేశం మీద కూడా ఉండవచ్చని ఇండియన్స్ అలెర్ట్ గా ఉండాలని కోరింది. అత్యవసర పనులు ఉంటే తప్ప ఆ దేశాలకు వెళ్లవద్దని సూచించింది.

 

ఇరాక్, ఇరాన్ లో ఉన్న ఇండియన్స్ అలర్ట్ గా ఉండాలని చెప్పింది విదేశాంగ శాఖ. బయట ఎక్కువగా తిరగవద్దని సూచించింది. బాగ్దాద్ లోని భారత ఎంబసీ, ఎర్బిల్ లో ఉన్న కాన్సులేట్ కార్యాలయాలు పని చేస్తున్నాయని, సమస్యలుంటే అక్కడ సంప్రదించాలని విదేశాంగ శాఖ తెలిపింది.ఎమన్నా భారతీయులకు సమస్యలు ఉంటే ఎర్బిల్ లో ఉన్న కాన్సులేట్ కార్యాలయములో తెలియచేస్తే సహాయ సహకారాలు అందచేస్తామని తెలిపింది. విమానాశ్రయాలలో కుడా హై అలెర్ట్ ప్రకటించారు.

 

ఇరాన్, ఇరాక్, గల్ఫ్ దేశాలకు వెళ్లే భారత విమానాలను కూడా అలర్ట్ చేశామని భారత  సివిల్ ఏవియేషన్ అధికారులు చెప్పారు. విమానాల రాకపోకలపై మరింత దృష్టిపెట్టాలని.. జాగ్రత్తలు తీసుకోవాలని సంస్థలకు సూచించినట్టు చెప్పారు. గల్ఫ్ రీజియన్ లో టెన్షన్ పరిస్థితులు ఉండటంతో పాటు భారతీయులకు ప్రాణహాని ఉండే అవకాశం కూడా ఉండవచ్చని ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు... ఈ సూచనని అందరు గమనించి సహకరించాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: