అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ తనపై అభిశంసన ప్రవేశపెట్టడాన్ని తట్టుకోలేక పోతున్నాడు. మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రతిపక్ష పార్టీ నేత, అధ్యక్ష బరిలో ఉన్న జో బిడెన్ కి వ్యతిరేకంగా ఉక్రెయిన్ తో చేతులు కలిపాడనే కారణంగా ట్రంప్ పై అభిశంసన చేపట్టిన విషయం విధితమే. అభిశంసన పై ముందు నుంచీ పట్టుబతున్న డెమోక్రటిక్ పార్టీ ట్రంప్ ని అమెరికా ప్రజల ముందు దోషిగా నిలబెట్టడాని చేయని ప్రయత్నం లేదు.

 

ఇదిలాఉంటే కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు అన్నట్టుగా ట్రంప్ పై అభిశంసన తీర్మానం మరింత బలంగా ఉండేలా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఇచ్చిన కీలక సమాచారాలు చివరికి అభిశంసన తీర్మానం పెట్టేలా చేశాయి. దాంతో అమెరికా చరిత్రలో అభిశంసన ఎదుర్కుంటున్న మూడే అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డ్ క్రియేట్ చేశారు. అతి త్వరలో ఈ అభిశంసన పై పూర్తి స్థాయి విచారణ ప్రారంభం కానుంది.

 

ఈ క్రమంలోనే ట్రంప్ తనపై వచ్చిన అభిశంసన తీర్మానాన్ని కొట్టేయాలని సెనేట్ ని కోరారు. ఈ అభిశంసన నిర్ణయం తనని రాజకీయంగా దెబ్బకొట్టడానికి డెమోక్రటిక్ పార్టీ నేతలు కుట్ర పూరితంగా పెట్టారని అన్నారు. అమెరికా ప్రజల మద్దతు పూర్తిగా తనకే ఉందన్న ట్రంప్ మరో సారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతానని ప్రకటించారు. అయితే తప్పు చేయకుండా ఉంటే అభిశంసన పై ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంటూ డెమోక్రటి పార్టీ నేతలు కౌంటర్ వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: