అమెరికాలో భారతీయుల సంఖ్య నానాటికి పెరుగుతూనే వస్తోంది.  ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత ట్రంప్ ఎన్నికల హామీలలో వలసదారులకి కళ్ళెం వేస్తామని ప్రకటించడంతో ఇక అమెరికా ఆశలపై భారతీయులు ఆశలు వదులుకోవాల్సిందే అనుకున్నారు అంతా. కానీ అనూహ్యంగా ది యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నివేదికలో తెలిపిన వివరాలు పరిశీలిస్తే..

 

 

అమెరికాలో ఇతరదేశాలతో పోల్చుకుంటే 2018 లో అమెరికా సరిహద్దు ప్రాంతమైన మెక్సికో కంటే కూడా భారతీయులే అత్యధికంగా ఉన్నారట. అయితే 2017 తో పోల్చితే ఈ సంఖ్య  సుమారు 2.7 శాతం పెరిగిందట. అయితే ఇదే లెక్కలు 2019తో పోల్చితే మొత్తం అమెరికా ఇప్పటి వరకూ దాదాపు 8.34 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చిందని, పదకొండేళ్ళలో ఇది అత్యదికమవ్వగా 2018 లో 9.5 శాతం ఎక్కువగా నమోదయ్యిందని తెలిపింది.

 

2018 లో అమెరికా దాదాపు 7,61,901 మందికి పౌరసత్వం ఇవ్వగా అందులో మెక్సికో నుంచీ దాదాపు 1,31 వేలమంది ఉన్నారని, ఆ తరువాత రెండో స్థానంలో భారత్ ఉందని, మూడవ స్థానంలో చైనా నిలిచిందని ఈ సర్వే తెలిపింది.. ఇక గ్రీన్ కార్డ్ పొందే వారిలో పోల్చితే భారత్ 4వ స్థానంలో నిలిచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: