దాదాపు అర్ధ  శతాబ్ద కాలం తర్వాత    బ్రిటన్ శుక్రవారం యూరోపియన్ యూనియన్ (ఇయు) సభ్యత్వం  నుండి వైదొలగింది, ప్రపంచంలో తనదైన అనిశ్చిత మార్గాన్ని రూపొందించడానికి అనేక సంవత్సరాల చేదు అనుభవాల  తరువాత  బ్రిటన్ ఈ  చారిత్రాత్మక నిష్క్రమణ చేసింది.  బ్రస్సెల్స్  లో  అర్ధరాత్రి  11 గంటలకు (23:00 జిఎంటి) బ్రిటన్ శుక్రవారం యూరోపియన్ యూనియన్ (ఇయు) సభ్యత్వం  నుండి వైదొలగిన  క్షణం గుర్తుగా వేలాది మంది యూనియన్ జాక్ జెండాలు పట్టుకొని  లండన్ పార్లమెంట్ స్క్వేర్లో గుమి గుడారు.   ప్రేక్షకులు జాతీయ గీతం పాడటానికి ముందు,   యూరోపియన్ పార్లమెంటు మాజీ సభ్యుడు నిగెల్ ఫరాజ్ మనము అనుకున్నది సాధించాము  అని  ప్రకటించారు, ఫరాజ్ బ్రెక్సిట్  (బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఇయు) సభ్యత్వం  నుండి వైదొలగే ప్రక్రియ) కోసం సంవత్సరాలుగా ప్రచారం చేసాడు.

 

 

 

 

 

 

 

దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ - బ్రెక్సిట్ కోసం చేసిన  ప్రజాభిప్రాయ సేకరణ లో  ఒక వ్యక్తి ముందుకు వెళ్లే రహదారిలో అడ్డంకులు  ఉండవచ్చు అని అంగీకరించారు. కానీ బ్రిటన్ దీనిని  తమకు అనుకూలంగా మలుచుకోగలదని   ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.  బోరిస్ జాన్సన్  తన డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయంలో ఒక ప్రైవేట్ పార్టీని నిర్వహిస్తున్నప్పుడు, బయట గోడలపై అంచనా వేసిన గడియారం బ్రెక్సిట్ వరకు నిమిషాలను లెక్కించింది.  ప్రపంచ వేదికపై బ్రిటన్ ముఖ్య  పాత్ర పోషిస్తుందని  మరియు యూరోపియాన్ యూనియన్ తో  స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంటుందని  జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేసారు.  ఈ రాత్రి చెప్పడానికి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ముగింపు కాదు, ఆరంభం అని టెలివిజన్ ప్రసంగంలో జాన్సన్  అన్నారు. ఈ వారం యూరోపియాన్  యూనియన్  పార్లమెంటులో బ్రిటన్ యొక్క నిష్క్రమణ భావోద్వేగల  మధ్య  ముగిసింది.  స్కాటిష్ సాంప్రదాయక  వీడ్కోలు పాట తో సమావేశం  ముగిసింది.   విడిపోవడానికి  ముందు బ్రస్సెల్స్లో బ్రిటన్ యొక్క ఎరుపు, తెలుపు మరియు నీలం జెండాలను యూరోపియాన్ యూనియన్  సంస్థలు తొలగించడం ప్రారంభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: