న్యూ ఇయర్ సెలేబ్రేషన్స్ అంటే అందరికి గుర్తొచ్చేవి పార్టీలు, ఫ్రెండ్స్, హడావిడి. రాత్రి పన్నెండు వరకు మెలుకువుగా ఉండి ఆ నిద్దర కళ్ళతో  హ్యాపీ న్యూయార్ అంటూ గట్టిగా అరుస్తూ కొత్త ఏడాది లోకి అడుగుపెడుతున్నాం అనుకుంటారు. కానీ  అది మన తెలుగువాళ్ళం జరుపుకునే సంవత్సరం కాదు. అసలు తెలుగువారికి కొత్త సంవత్సరం అనే ఉగాది. ఈరోజు నుంచే మనకు అసలు సిసలైన కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఏ దేశంలో స్థిరపడినా సరే తెలుగు వారంతా ఈ పండుగను తప్పకుండా జరుపుకుంటారు.

 

ఈ క్రమంలోనే న్యూజిలాండ్ లో ఉన్న తెలుగు ఎన్నారైలంతా కలిసి ఉగాది ని ఘనంగా జరుపుకోవడం కోసం ఏర్పాట్లు ఇప్పటినుంచి మొదలుపెట్టేశారు. న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ అనే సంస్థ అక్కడి తెలుగు ఎన్నారైలకు అన్ని రకాల సేవలందించడానికి ఏర్పాటైన సంస్థ. ఈ సంస్థ ద్వారా  అనేక కార్యక్రమాలు తెలుగు వారికి ఉపయోగపడే విధంగా నిర్వహిస్తారు. ఆ విధంగానే ఇప్పుడు ఈ తెలుగు సంవసత్సరాది పండుగని కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు.

 

మార్చి 28 -2020 న  ఉగాది వేడుకలని ఆక్లాండ్ లో మహాత్మా గాంధీ సెంటర్ 145 న్యూ నార్త్ రోడ్ ఈడెన్ టెర్రస్ నందు, సాయంత్రం 3 గంటలకి ఈ వేడుకలని ప్రారంభించనున్నారు.ఈ వేడుకలకి తెలుగు సినిమా గాయకులు అయిన సింగర్ మల్లికార్జున రావు, గోపిక పూర్ణిమా ఇద్దరూ ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారని ఓ ప్రకటనలో తెలిపారు. న్యూజిల్యాండ్ లో ఉండే ప్రతీ తెలుగువారు ఇందుకు ఆహ్వానితులేనని తెలిపారు.

.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: