మనం చుసిన సినిమా స్టోరీలే కొన్ని కొన్ని సార్లు నిజం అవుతుంటాయి. ఆ సినిమా స్టోరీ నిజమైనప్పుడు ఒక్కసారిగా షాక్ కి గురవ్వక తప్పదు. ఆ స్టోరీలు ఆలా ఉంటాయి మరి. ఇంకా ఈ తరహాలోనే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.. ఆ ఘటన చూస్తే మీకు ఖచ్చితంగా లైఫ్ అఫ్ ఫై సినిమా గుర్తొస్తుంది. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాపువా న్యూ గినియాలోని బౌగన్‌విల్లే ప్రావిన్స్‌కు చెందిన ఓ బృందం డిసెంబరు 22న కార్టెరెట్‌ ఐలాండ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడగా ఏడుగురు మునిగిపోయారు. ఓ చిన్నపాపతో పాటు మరో నలుగురు బోటును గట్టిగా పట్టుకుని వేలాడుతూ అందులోని నీళ్లు తొలగించి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయాన్నీ స్థానిక మీడియా తెలిపింది.  

 

అయితే సరైన ఆహారం లేకపోవడంతో చిన్నపాప మృతిచెందగా ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ, పన్నెండేళ్ల బాలిక మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో వీరంతా సముద్ర తీరంలో దొరికిన కొబ్బరికాయలు తింటూ వర్షపు నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఆఖరికి చేపల వేటకు బయల్దేరిన ఓ సమూహం వీరిని గుర్తించి సాయం అందించడంతో సముద్రం నుంచి బయటపడ్డారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: