అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన వెనుకాల పెద్ద తతంగమే ఉందని అంటున్నారు నిపుణులు. ఊరకే రారు మహానుభావులు అన్నట్టుగా..సహజంగానే వ్యాపారవేత్త అయిన ట్రంప్ లాభం లేకుండా ఏ పనిచేయడు అంటూ గుసగుస లాడుతున్నారు. క్షణం తీరికలేని ట్రంప్, అందులోనూ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రచార హడావిడిలో ఉండే ట్రంప్ ఒక్క సారిగా భారత పర్యటన చేపట్టడానికి ప్రధానకారణం ఏమిటంటే..

 

త్వరలో జరగబోయే అమెరికా ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ప్రవాసుల ఓట్లు అత్యంత కీలకం కాబోతున్నాయి. లక్షల మంది భారతీయ ప్రవాసులు ఇచ్చే బలమైన ఓట్లు దేశాధ్యక్షుడిని సైతం డిసైడ్ చేసివిగా మారబోతున్నాయి. అమెరికాలో ఉండే ప్రవాసులలో అత్యధికులు భారతీయులేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు..అంతేకాదు భారతీయ ప్రవాసులలో అత్యధిక శాతం గుజరాత్ ప్రాంతం నుంచీ వెళ్ళిన వారు కావడం ఇక్కడ మరొక విశేషం.

 

గుజారాత్ తరువాత సిక్కుల ఓట్లు అమెరికాలో అధికంగా ఉన్నాయి. దాంతో మోడీ పర్యటన గుజరాత్ వైపుగా వెళ్ళింది. ట్రంప్ కోరిక ప్రకారమే పక్కా వ్యూహంతో ఈ భారత పర్యటన ఖరారయ్యిందని తెలుస్తోంది. అంతేకాదు ఎప్పటి నుంచో ట్రంప్ అమెరికా డైరీ ఉత్పత్తులకి, అక్కడ తయారయ్యే వైద్య పరికరాలకి భారత దేశంలో మార్కెట్ చేయాలని, అందుకు గాను రాయితీలు భారీగా ఇవ్వాలని పట్టుబడుతోంది. అందుకు ప్రతిగా అమెరికా గతంలో భారత్ కి రద్దు చేసిన హోదాలు అన్నీ తిరిగి ఇప్పించాలని డిమాండ్ కూడా చేస్తోంది. అయితే ఈ పర్యటనలో ఎక్కువగా లాభపడేది మాత్రం ట్రంప్ అని, భారత్ తో వాణిజ్యపరమైన ఒప్పంద విషయంలో దాటవేస్తున్న ట్రంప్ తన ప్రయోజనాల కోసం భారత్ వచ్చి వెళ్తారని. భారత్ కి ట్రంప్ పర్యటనతో పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు విశ్లేషకులు.

 

 

ట్రంప్ భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ రాబోతున్నారు. అక్కడ ట్రంప్ ప్రారంభించనున్న అతి పెద్ద స్టేడియం ప్రపంచంలోకెల్లా అతిపెద్దది. సుమారు లక్ష మందిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడనున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ట్రంప్ 

 

మరింత సమాచారం తెలుసుకోండి: