అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల అంటే ఫిబ్రవరి 24 వ తేదీన మొదలు రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న విషయం విధితమే. ఈ పర్యటనలో భాగంగా ట్రంప్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సుమారు 3 గంటల పాటు పర్యటించనున్నారు. అక్కడ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్టేడియంని ట్రంప్ తన చేతుల మీదుగా ప్రారంభిచడమే కాకుండా సుమారు లక్షమంది ప్రజలని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

 

ఈ క్రమంలోనే గుజరాత్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తోంది. అయితే ట్రంప్ కేవలం గుజరాత్ లో 3 గంటలు మాత్రమే ఉండనున్నారు. ఈ 3 గంటల కోసం అక్కడి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా. అక్షరాలా 100 కోట్లు. ఏంటి షాక్ అయ్యారా. అవును మీరు విన్నది నిజమే అక్షరాలా 100 కోట్లు మంచి నీళ్ళులా ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. ఆయనకి స్వాగతం పలకడానికి ఈ లెక్కలో అమెరికా నిమిషానికి చేసే ఖర్చు సుమారు 55 లక్షలు..అయితే

 

ఈ ఖర్చు పై స్పందించిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్, సిటీ డెవలప్మెంట్ అధికారులు. ట్రంప్ తిరిగే ప్రతీ చోట రోడ్లని సుందరీకరించడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి భారిస్తున్నాయని. ఇప్పటి వరకూ సుమారు 60 కోట్లు ఖర్చు అయ్యిందని ఇంకా 50 కోట్ల మేర ఖర్చు అవుతోందని ప్రకటించారు. ఇదిలాఉంటే ట్రంప్ వచ్చి  వెళ్ళే వరకూ కూడా ఆతిధ్యంలో ఎక్కడా రాజీపడేది లేదని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి స్పష్టం చేశారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: