అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా మోడీ ఎయిర్పోర్ట్ నుంచీ సాదర స్వాగతం పలికారు.  ఈ క్రమంలో మోడీ , ట్రంప్, ఇవాంకా లతో పాటుగా  మరొక మహిళా కూడా రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వచ్చారు. దాంతో ట్రంప్ పర్యటన వివరాలకంటే కూడా వీక్షకులకి అసలు ఆమె ఎవరు..ఎందుకు ట్రంప్ మోడీ లతో కలిసి నడిచింది అనే విషయం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. ఇప్పుడు ట్రంప్ పర్యటనకంటే కూడా ఆమె టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

IHG

ఆమె పేరు గురుదీప్ చావ్లా అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన మహిళ. ఆమె ట్రాన్స్లేటర్ గా సుమారు 27 ఏళ్ళకి పైగా అనుభవం ఉంది. భారత ప్రధాని మోడీ కి ప్రస్తుతం ట్రాన్స్లేటర్ గా పనిచేస్తున్నారు. 1990 లోనే ఆమె ఇండియన్ పార్లమెంట్ లో ట్రాన్స్లేటర్ గా కెరియర్ ప్రారంభించిన ఆమె 2015 లో ఒబామా వచ్చిన సమయంలో కూడా ట్రాన్స్లేటర్ గా సేవలు అందించారు. మోడీ ఏ దేశం వెళ్ళినా సరే ఆమె మోడీ వెంటే ఉంటారు. ఆయన చేసే హిందీ ప్రసంగాన్ని అప్పటికప్పుడు ఇంగ్లీష్ లో కి తర్జుమా చేసి ఆయా దేశ నేతలకి తెలియచేస్తారు.

IHG

గురుదీప్ చావ్లా కేవలం ప్రధాని మోడీ వద్దనే కాదు,  నరసింహారావు, వీపీ సింగ్, చంద్రశేఖర్ , మన్మోహన్ సింగ్, వాజ్పేయి వంటి ఎంతో మంది వద్ద ట్రాన్స్లేటర్ గా పనిచేశారు. అయితే తాజాగా ఆమె అహ్మదాబాద్ లోని విమానాశ్రయం నుంచీ ట్రంప్, మేలానియా, మోడీ లతో పాటు రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వచ్చిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: