ప్రేమకు బాషా లేదు.. ప్రేమకు ప్రాంతం లేదు.. ప్రేమకు కులం లేదు.. మతం లేదు. ఎందుకంటే ప్రేమ గుడ్డిది కాబట్టి. అందుకే కొందరు ప్రేమించి పెళ్లి చేసుకొని ఒకటవుతుంటారు. అల అయినవారిలో ఎంతోమంది ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఎంతోమంది ప్రాంతాల నుండి దేశాల వరుకు వేరు వేరు వారిని పెళ్లి చేసుకున్నారు. 

 

ఇక ఈ నేపథ్యంలోనే ఓ తెలుగు అమ్మాయి.. ఇంగ్లాండ్ అబ్బాయి ప్రేమ పేరుతో దగ్గరయ్యి పెళ్లి పేరుతో ఒకటయ్యారు. తెలంగాణ అమ్మాయి.. ఇంగ్లాండ్ అబ్బాయి ఇంట్లో వారిని ఒప్పించి మరి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. నాల్గోన జిల్లా మునుగోడు మండలం పలివెల చెందిన కొండవీటి విఘ్నేశ్వర్‌ రెడ్డి, లత దంపతుల కుమార్తె సింధూజ.

 

కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌ కు వచ్చి సెటిల్ అయ్యారు. కూతురు సింధూజ ఎనిమిదేళ్ల కిందట ష్యాషన్‌ డిజైన్‌ కోర్సు చేయడం కోసం ఇంగ్లాండ్‌ వెళ్లింది. అక్కడ బెంజిమిన్‌ డేవిడ్‌ హాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ అయ్యింది. దింతో రెండేళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు.. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

 

 దీంతో ఇంట్లో వారికీ ఈ విషయం చెప్పారు.. ఇరువురి కుటుంబాలు పెళ్ళికి అంగీకరించాయి.. కథ సుఖాంతం అయ్యింది. బంధు మిత్రుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి నిన్న గురువారం ఒకటయ్యింది. ఈ వేడుకకు వరుడు తల్లితండ్రులు, బంధుమిత్రులు కూడా హాజరయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: