కరోనా ధాటికి ప్రపంచం నలుమూలల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నిపుణుల హెచ్చరికలతో బయటకి రావడానికి కూడా సాహసించడంలేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 వేలమంది ప్రజలు మృత్యు వాత పడ్డారని తెలియడంతో అందరికి వెన్నులో వణుకు పుడుతోంది. ఎక్కడి ప్రయాణాలు అక్కడే పెట్టి మరీ ఇళ్ళకి పరిమితమై పోతున్నారు.కానీ...

IHG

అమెరికాలోని ఓ తెలుగు ఎన్నారై తన తండ్రి మరణ వార్త విని తల్లడిల్లిపోయాడు. కరోనా అమెరికాలో తీవ్రమైన ప్రభావం చూపుతున్నా సరే ఎవరూ  కనీసం బయటకి రావడానికి సాహసించక పోయినా తన తండ్రిని చివరి సారిగానైనా చూసుకోవాలని కరోనా పై సవాల్ విసిరి మరీ తెలంగాణాలోని తన సొంత గ్రామం చేరుకున్నాడు. తన తండ్రి అంత్య క్రియలలో పాల్గొన్నాడు. వివారాలలోకి వెళ్తే...

తెలంగాణా రాష్ట్రం  ముల్కనూర్ కి చెందిన పెద్ది రాజిరెడ్డి అనే వ్యక్తి గుండె పోటుతో మరణించారు.ఈ వార్త తెలుసుకున్న వెంటనే అమెరికాలో ఉంటున్న కొడుకు నితీష్ రెడ్డి కరోనాని సైతం లెక్క చేయకుండా తన సొంత ఊరు వెళ్ళడానికి విమానాశ్రయానికి వెళ్ళాడు. అక్కడ పెట్టిన స్క్రీనింగ్ టెస్ట్ లు పూర్తి చేసుకుని కరోనా లేదని నిర్ధారించుకుని బయలు దేరారు. తరువాత ముంబై లో విమానం దిగిన తరువాత అక్కడ ఏర్పాటు చేసిన టెస్ట్ లలో కూడా పాల్గొని కరోనా లేదని నిర్ధారించుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడ విమానాశ్రయం లో కూడా స్క్రీనింగ్ టెస్ట్ లు చేసిన తరువాత తన సొంత ఊరు వెళ్లి తండ్రిని చూసుకుని బోరున విలపించాడు. కుటుంభ సభ్యులు నచ్చచెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా ఇబ్బడి ముబ్బడిగా వ్యప్తిస్తున్న క్రమంలో తండ్రికోసం తెగించి మరీ దేశాలు దాటుకుంటూ వచ్చిన నితీష్ రెడ్డి కరోనాకే సవాల్ విసిరాడంటూ ఈ ఉదంతం తెలుసుకున్న నిటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: