కరోనా ధాటికి అమెరికాలో ప్రజలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే 2000 మందికి పైగానే మృతి చెందగా లక్షల సంఖ్యలో కేసులు నమోదవ్వడంతో మరింత ఆందోళనలు మొదలయ్యాయి. కరోనా ధాటికి అమెరికా ఆర్ధిక పరిస్థితి అతలాకుతలం అయ్యిపోయింది. అన్ని వ్యాపార వ్యవస్థలు మూసివేయబడ్డాయి, అత్యవసర విభాగాలు తప్ప అందరూ షట్ డౌన్ లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే...

IHG

అమెరికాలోని వాషింగ్టన్ లో సుమారు ఐదు దశాబ్ధాలుగా  భారతీయ అమెరికన్స్ కి, ఎన్నారై లకి సేవలు అందిస్తున్న “ఇండియా అబ్రోడ్” ప్రింట్ పత్రిక మూతబడింది. ఈ విషయాన్ని పత్రిక యాజమాన్యం స్వయంగా ప్రకటించింది. కరోనా ధాటికి యాడ్స్ లేకపోవడంతో మూసేయక తప్పడం లేదని తెలిపింది. ఈ పత్రికని 1970 లలో ప్రవాస భారతీయుడు గోపాల్ రాజు స్థాపించిన ఈ పత్రిక సుమారు 50ఏళ్ళుగా అమెరికాలో సేవలు అందుకుంటోంది...

IHG

అమెరికా వ్యాప్తంగా రాజకీయం , సాంకేతికత, సాహిత్యం, విద్యా ఇలా వివిధ రంగాలపై తనదైన రీతిలో వార్తలు అందించేది. 2011 లో రెడిఫ్ డాట్ కామ్ సంస్థ ఈ పత్రిక కొనుగోలు చేసి 2016 లో 8 కే మైల్స్ మీడియా ఇంక్  సంస్థకి హక్కులు ఇచ్చేసింది. అయితే ఈ పత్రిక చివరి ఎడిషన్ ఈరోజు అందిస్తామని ఆ తరువాత కేవలం వెబ్ ఎడిషన్ మాత్రమే పాటకులకి అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇదిలాఉంటే ఈ పత్రిక ప్రస్తుత పరిస్థితి మెరుగుపడి గతంలోలా మంచి వార్తలని అందిచాలని ఎన్నారైలు కోరుకుంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: