కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. ముఖ్యంగా అగ్ర రాజ్యం పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. దాంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెరికాలో భారీ స్థాయిలో లె ఆఫ్ లు ప్రకటిస్తారేమోననే భయాందోళనలు నెలకొన్నాయి. దాంతో ముందస్తుగానే హెచ్-1బి వీసా ఉన్న వలస వాసులు అందరూ అమెరికా ప్రభుత్వానికి ఓ అభ్యర్ధన పెట్టుకున్నారు. వివరాలలోకి వెళ్తే..

 

అమెరికా ఎన్నడూ లేనంతగా పెను ఆర్ధిక సంక్షోభంలో ఉందని, రానున్న రోజుల్లో ఇది మరింత దారుణంగా మారనుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపధ్యంలోనే గత వారంలోనే సుమారు 33లక్షల మంది అమెరికన్స్ తమ ఉద్యోగాలు పోయాయని దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ కరోనా ప్రభావం మరో నెల పాటు ఉండే అవకాశం ఉండటంతో ఈ సంఖ్య సుమారు 47 లక్షలు దాటే పరిస్థితి కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హెచ్ -1 బి వీసా దారుల ఉద్యోగాలు చాలావరకూ తొలగించారని తెలుస్తోంది..ఈ నేపధ్యంలోనే హెచ్-1బి వీసా దారులు అమెరికా ప్రభుత్వానికి అభ్యర్ధన లేఖ పెట్టుకున్నారు.

 

 

అమెరికా ప్రజలు కాకుండా మరే దేశం నుంచీ ఉద్యోగ రీత్యా అమెరికాకి వచ్చే వారికి  ఈ హెచ్-1బి వీసా ద్వారా మాత్రమే వస్తారు. అలాంటి వారు ఎవరైనా సరే ఒక్క సారిగా వారి ఉద్యోగం గనుకా పొతే కుటుంభం తో సహా 60 రోజుల్లో అమెరికా విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్-1బి వీసా దారులు మా ఉద్యోగాలు తొలగిపోతే, అమెరికాలో ఉండే కాలపరిమితిని 60 రోజుల నుంచీ 180 రోజులకి పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 20వేల మంది ఎన్నారైలు సంతకాలు చేశారని, సుమారు లక్షమంది పైగా సంతకాలు చేస్తే గాని హెచ్-1బి వీసా దారుల అభ్యర్ధన వైట్ హౌస్ పరిగణించదని తెలుస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: