ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో కరోనా మృతులతో శవాల దిబ్బలుగా తయారయ్యి కొన్ని దేశాలు. ఇప్పటికే స్వయంకృతాపరాధం కారణంగా అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. మెల్ల మెల్లగా కరోనా కేసులు తక్కన దేశాలన్నిటికీ పాకుతున్నాయి. దక్షిణాప్రికాలో మొత్తం మరణాల సంఖ్య 4 గా నమోదు కాగా తాజాగా ఈరోజు భారత సంతతి శాస్త్రవేత్త మృతితో 5 కి చేరుకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత  భారత సంతతి మహిళా  వైలారజిస్ట్ శాస్త్రవేత్తగా పేరుతెచ్చుకున్న  గీతా రామ్ జీ కరోనా కారణంగా మృతి చెందారు.

గీతా రామ్ జీ వయసు 50 ఏళ్ళు. హెచ్ఐవీ పరిశోధకురాలిగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుని ఎన్నో ప్రయోగాత్మక పరిశోధనలు చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన గీతా రామ్ జీ మృతి తో ఒక్క సారిగా దక్షిణాఫ్రికా షాక్ అయ్యింది. గత వారమే దక్షిణాఫ్రికా వచ్చిన ఆమె అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారని కరోనా సోకిందని తెలియడంతో వైద్యులు ట్రీట్మెంట్ మొదలు పెట్టారని, ఈ క్రమంలోనే ఆమె కోవిడ్ లక్షణాలతో మృతి చెందారని వైద్యులు తెలిపారు.

IHG

ప్రస్తుతం గీత రామ్ జీ దక్షిణాఫ్రికా పరిశోధన మండలిలో క్లినికల్ ట్రైల్స్ విభాగంలో కీలక సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు. హెచ్ఐవీ పై ఆమె చేసిన పరిశోధనలకి గాను ఆమెకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. అందుకు గాను ఆమె ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు. ఆమె మృతి దక్షిణాఫ్రికా వైద్య రంగానికి తీరని లోటని దక్షిణాఫ్రికా వైద్య పరిశోధనా మండలి అధ్యక్షుడు గ్లెండా గ్రే ప్రకటించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: