కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 9 లక్షలమంది ఈ కరోనా బారిన పడ్డారు. అందులో 48వేలమంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఈ కరోనా వైరస్ తగ్గాలి అని అన్ని దేశాలలో లాక్ డౌన్ విధించారు. ఇంకా ఈ నేపథ్యంలోనే యూఏఈ అధికారులు ఓ ప్రకటన చేశారు. 

 

కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో ఇప్పటికే వణికిపోతున్న యూఏఈకు ఓ కీలక ప్రకటన చేసింది. అది ఏంటి అంటే? కరోనా వైరస్ ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా కరోనావైరస్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తే వారికి ఏకంగా రూ .20 లక్షలు జ‌రిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించ‌బ‌డుతుందని అక్క‌డి అధికారులు తెలిపారు. 

 

అంతేకాదు క‌రోనా వైర‌స్ సోకిన‌వాళ్లు బయపడి వెంటనే ఆరోగ్య‌శాఖ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌క‌పోతే రూ. 20 ల‌క్ష‌ల జ‌రిమానాతో పాటు మూడేళ్లు జైలు శిక్ష వెయ్యాల్సి వస్తుంది అని ప్రకటనలో తెలిపారు. యూఏఈలో ఇప్పటి వరుకు 814 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి... అందులో ఎనిమిది మంది మృతి చెందారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: