ఏంటి బూతు పదం వాడేశామని కంగారు పడకండి..ఇది మా మాట కాదు అమెరికాలో ఉంటున్న ఎన్నారైల వ్యధ. ఇలాంటి బ్రతుకు బహుశా బ్రతుకుతామని అనుకోలేదు. మరీ ఇంత దారుణమా  అంటూ తెలుగు ఎన్నారైలు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అమెరికాలో కరోనా చేస్తున్న విధ్వంసం చూస్తున్న వాళ్ళందరూ అసలు అమెరికా ఎందుకు వచ్చామని భాదపడుతున్నట్టుగా తెలుస్తోంది.

 

 

కరోనా ఎఫ్ఫెక్ట్ కారణంగా ఎంతో మంది తెలుగు ఎన్నారైలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇలా ఇళ్ళకి పరిమితం అయిన వారిలో చాలా మంది కుటుంభతో కలిసి ఉండగా, మరికొందరు ఒంటరి జీవితం అంటే పెళ్ళిళ్ళు చేసుకొని  యువతీ యువకులు మరికొందరు పెళ్లై రెండు మూడు ఏళ్ళు అయిన వాళ్ళు. ఒక్కొక్కరిది ఒక్కో రకం భాద. ఒంటరిగా ఉండలేక, వ్యక్తిగత పనులు చేసుకోలేక, బయటకి వెళ్ళలేక అల్లాడి పోతున్నారు. కళ్ళ ముందే జరుగుతున్న దారుణమైన మరణాలు చూసి మానసికంగా కునిగిపోతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇక భార్యా, భర్త ఇద్దరే ఉంటే వారికి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ బ్రతికేస్తున్నారు.మంచి నీళ్ళ బాటిల్స్ కావాలన్నా సరే గంటల తరబడి క్యూలో నుంచుని కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.

 

 

సూచనలు చేసే పెద్ద దిక్కు లేదు..హెచ్చరించే మనుషులు లేరు. ఇళ్ళలో ఉన్నంత కాలం సరపడా సరుకులు తెచ్చుకుని గడిపేస్తున్నారు. కొందరు పిల్లలతో ఉన్న కుటుంభాలైతే అందరూ కలిసి సరదాగా తెలుగు సినిమాలు చూస్తూ గడిపేస్తున్నారు. గార్డెన్ లో పనులు చేయడం, వంటలు వండటం, ఇలా ప్రతీ పనిలో నిమగ్న మవుతున్నారు. అయితే అందరిలో ఒక్కటే ఆందోళన  ఈ ఎప్పుడు మీ ఉద్యోగం పోయింది అంటూ మెయిల్స్ వస్తాయోనని అదే జరిగితే పరిస్థితులు అన్నీ మారిపోతాయి ఏమి చేయాలో తెలియక మింగలేక కక్కలేక ఎన్నారైలు పడుతున్న ఆందోళనలు అన్నీ ఇన్నీ కావు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: