అమెరికాలో కరోన రోజు రోజుకి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.  కరోనా తగ్గుముఖం పడుతోందని అమెరికా ప్రజలు సంతోషం వ్యక్తం చేసేలోగా మరింతమంది పై తన ప్రభావాన్ని చూపిస్తోంది. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా బిక్కు బిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితి  పై అమెరికాలోని పరిశీలకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ళ పాటు జరిగిన వియాత్నాం లాంటి భీకరమైన యుద్దంలో మరణించిన వారి సంఖ్య 47 వేలు కానీ కరోనా మాత్రం కేవలం నెల రోజుల కాలంలో 50 వేల మందిని బలి తీసుకోవడంతో భవిష్యత్తు ఎలా ఉండబోతోందోనంటూ ఆందోళన చెందుతున్నారు.

IHG

ముఖ్యంగా అమెరికాలో స్థిరపడాలని సొంత దేశాలని వదిలి అమెరికా వెళ్ళిన వలస వాసుల పరిస్థితి ఒకింత సంతోషంగా లేదనే చెప్పాలి బ్రతుకు జీవుడా అంటూ ఇళ్లకే పరిమితం అయిపోయారు ఎన్నారైలు. ఒక పక్క ఉద్యోగాలు పోతున్నాయనే ఆందోళన మరో పక్క రోజు రోజుకి అమెరికాలో మృతుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్న ఆందోళనలతో మానసికంగా చాలామంది కుంగిపోతున్నారు. వీరికి స్థానికంగా ఉన్న తెలుగు సంఘాలు ఎంతో ధైర్యాన్ని నింపుతున్నాయి..ఇదిలాఉంటే..

IHG

 అమెరికాలో ప్రజారోగ్యంపై ట్రంప్ దృష్టి పెట్టలేక పోతున్నారు. ఎక్కడ కరోనా పరిస్థితులు తన అధ్యక్ష పదవికి ఆటంకం కలిగిస్తాయో నని కంగారు పడుతున్నారు. ఈ క్రమంలోనే శ్రామికులు అందరూ పనులకి వెళ్ళాలని త్వరలో లాక్ డౌన్ ఎత్తేస్తామని ప్రకటించారు. దాంతో అమెరికా వ్యాప్తంగా ట్రంప్ పై ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడం కారణంగానే అమెరికాలో పరిస్థితి చేయిదాటిందని..మళ్ళీ ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తే కరోనా మరింత విస్తృతం అవుతునని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ లాక్ డౌన్ కొనసాగిస్తేనే భవిష్యత్తులో కరోనాని జయించ వచ్చని అంటున్నారు నిపుణులు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: