కరోనా ప్రపంచ వ్యాప్తంగా ప్రళయం సృష్టిస్తున్న విషయం విధితమే. అగ్ర రాజ్యం అమెరికా ప్రజలని  మాత్రం కరోనా పగబట్టినట్టుగా తన ప్రభావాని చూపుతోంది. ముఖ్యంగా అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్ లో కరోనా కరాళ నృత్యమే చేసింది..చేస్తోంది కూడా. దాంతో ప్రపంచం మొత్తం అగ్ర రాజ్యానికి సైతం ఇలాంటి ఇప్పలు తప్పలేదు అంటూ వ్యాఖ్యానించాయి కూడా. ట్రంప్ అలసత్వం వలనే న్యూయార్క్ నగరానికి ఈ పరిస్థితి పట్టిందని ముందు నుంచీ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ తాజాగా

IHG

అధ్యక్షడు ట్రంప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు..ఆండ్రూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలో కలకలం రేపుతున్నాయి. న్యూయార్క్ లో కరోనా ప్రభలడానికి కారణం చైనా కాదని న్యూయార్క్ లోకి కరోనా ఎంట్రీ ఇచ్చింది యూరప్ దేశాల నుంచీ అంటూ ట్రంప్ మైండ్ బ్లాక్ అయ్యేలా స్టేట్మెంట్ ఇచ్చాడు..ట్రంప్ ఫిబ్రవరి 2 నుంచీ చైనా నుంచీ వచ్చే వారికి ఎంట్రీ ఇవ్వలేదని వారిపై అప్పుడే నిషేధాలు పెట్టారని గుర్తు చేశారు..

IHG't wear ...

ట్రంప్ ఈ ఆదేశాలు ఇచ్చిన తరువాత యూరప్ నుంచీ వచ్చే వారిపై సుమారు నెల రోజుల తరువాత నిషేధం విధించారని కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయిందని అన్నారు. కరోనా అమెరికాలోకి అడుగు పెట్టకుండా తీసుకోవాల్సిన చర్యలని ట్రంప్ చేపట్టలేదని అందుకే ఇలాంటి దారుణమైన పరిస్థితులు అమెరికా ప్రజలు ఎదుర్కుంటున్నారని అన్నారు. ఇదిలాఉంటే ఒక పక్క ట్రంప్ అమెరికాకి జరిగిన తీరని నష్టానికి చైనాని ప్రపంచం ముందు దోషిగా నిలబెడుతుంటే న్యూయార్క్ గవర్నర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ట్రంప్ ని ఇరకాటంలోకి నెట్టేశాయి..ఇప్పటి వరకూ కరోనా కారణంగా 54 వేల మంది మృతి చెందగా దాదాపు 9.60 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. భవిష్యత్తులో మృతుల సంఖ్య లక్షకి పైగానే ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: