కరోనా మహమ్మారి భారతీయ వైద్యులు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. విదేశాలలో స్థిరపడిన ఎంతో మంది భారతీయ వైద్యులు కరోనా కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయా దేశాలలో కరోనా బాధితులకి సేవలు అందించడంలో అలుపెరుగకుండా పనిచేశారు. ఈ క్రమంలోనే వారికి కరోనా సోకి తీవ్రమవడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా బ్రిటన్ లో మరో ఎన్నారై వైద్యుడు కరోనా దాటికి మృతి చెందారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదనకీ లోనయ్యారు..కన్నీటి పర్యంతం అయ్యారు..

IHG'honest, kind and ...

బ్రిటన్ లో ఎన్నో ఏళ్ళ క్రితమే స్థిరపడిన భారతీయ వైద్యుడు డాక్టర్ కమలేశ్ కుమార్ మాసన్ కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. దాంతో ఆయన వైద్య సేవలని తలుచుకుని ప్రజలు ఎంతో ఆవేదనకి  లోనయ్యారు. కమలేశ్ కుమార్ ఎంతో మంచి వ్యక్తి, బ్రిటన్ వైద్య రంగంలో ఎంతో పేరుతెచ్చుకున్న వ్యక్తి అంటూ వైద్యులు ఆయనకి నివాళులు అర్పించారు. అలాగే కుటుంభ సభ్యులు, రోగులు సైతం కమలేశ్ కుమార్ కి నివాళులు అర్పించారు..కమలేశ్ సేవలని కొనియాడారు..

IHG

ధరాక్ లో జనరల్ ప్రాక్టీషనర్ గా కమలేశ్ కుమార్ కి ఎంతో మంచి పేరుంది. స్థానికంగా ఆయనపై అక్కడి ప్రజలు అపారమైన గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. ధరాక్ లో సుమారు 50 ఏళ్ళుగా రోగులకి సేవలు అందిస్తూ అండగా నిలిచారాని ఆయన మృతి చెందటం తీరని లోటని నేషనల్ హెల్త్ చైర్మెన్ ఖలీల్ శ్రద్ధాంజలి ఘటించారు. ఇటీవల కాలంలో కరోనా తో డాక్టర్ జితేంద్ర కుమార్ , మంజీత్ సింగ్, రియాత్ ,క్రిషన్ వంటి ఎంతో మంది భారతీయ వైద్యులు కరోనా కాటుకి బలై పోయిన వారు కావడం గమనార్హం. ఇదిలాఉంటే ఈ విషయంపై స్పందించిన ప్రధాని బోరిస్ భారతీయ వైద్యుల మరణాల పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: