ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. అన్ని దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడి పోతున్నాయి. లక్షల్లో మరణాలు..లక్షలాది మంది కరోనా బాధితులతో ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. భారత్ లాక్ డౌన్ పేరుతో కరోనాని కట్టడి చేయడంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలువగా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ పైనే ఎక్కువగా శ్రద్ద పెట్టాయి..అమెరికాలో లాక్ డౌన్ కొనసాగిస్తున్న నేపధ్యంలోనే అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు..

IHG

అమెరికాలో ఇప్పటివరకూ కరోనా కేసులు 10 .30 లక్షలు నమోదు కాగా..సుమారు 59 వేల మరణాలు నమోదయ్యాయి. అయితే ముఖ్యంగా న్యూయార్క్ లో ఏకంగా 3 లక్షలపైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 23 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే న్యూయార్క్  కి  కోలుకోలేని దెబ్బ తగులుతుందని అందుకే ప్రజలు ఎవరూ బయటకి రాకుండా ఉండటానికి లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుస్తున్నారు ఆండ్రూ...

IHG

ఇదిలాఉంటే ఒక పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాక్ డౌన్ ఎత్తివేస్తాం అంటూ ప్రకటనలు చేస్తున్న నేపధ్యంలో ఆండ్రూ ఈ విధంగా స్పందించడం సంచలనం కలిగిస్తోంది. న్యూయార్క్ లో కూడా దశల వారీగా లాక్ డౌన్ ఎత్తి వేయనున్నట్టుగా ఆండ్రూ తెలిపారు. మొదటి దశలో ఇన్ఫెక్షన్ ప్రభావం తక్కువగా ఉన్న రంగాలని మొదటి దశలో ఆ తరువాత తాము వేసిన అంచనాలని బట్టి వైరస్ ప్రభావం లేని చోట రెండవ దశ ని అది కూడా మొదటి దశ అమలు చేసిన రెండు వారాల తరువాత చేపడుతామని ప్రకటించారు. మొత్తానికి ట్రంప్ కంటే న్యూయార్క్ గవర్నర్ కి ఈ వైరస్ విరుగుడుపై ఓ క్లారిటీ ఉన్నట్టుగా అనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: