కరోనా మహమ్మారి దెబ్బకి అమెరికా అతలాకుతలం అయ్యిపోయింది. అమెరికా పౌరులు నిరుద్యోగులుగా మారకుండా ఉండేందుకుగాను..త్వరలో రాబోతున్న అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను ట్రంప్ రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు ఇందులో భాగంగానే హెచ్-1 బి వీసాపై కొన్ని రోజుల క్రితం తాత్కాలిక నిషేధ నిర్ణయం తీసుకున్నారు.  అయితే జూన్ లోనే ఈ గడువు ముగియనున్న నేపధ్యంలో దాదాపు 2 లక్షల మంది ఎన్నారైల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

IHG

ఒక వైపు అంతర్జాతీయ ప్రయాణలపై భారత్ నిషేధాన్ని కొనసాగిస్తే ఇండియాకి వచ్చే ఎన్నారైల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారుతుంది. ఇదిలాఉంటే జూన్ నాటికి వీసా గడవు ముగియనున్న వారిలో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు కోసం అప్ప్లై చేసుకున్న వారు దాదాపు 2.5  లక్షల మంది ఉన్నారు. అలాగే గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుని జూన్ లోపు వీసా గడువు ముగిసే  హెచ్-1 బి వీసా దారులు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు..ఇలా వీరందరూ కూడా వారి వారి స్వదేశాలకి వెళ్ళాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ వీసా ల నిపుణుడు న్యూ ఫెల్డ్ తెలిపారు..ఇదిలాఉంటే

IHG

అమెరికా వ్యాప్తంగా హెచ్-1 బి వీసా  ద్వారా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారిలో దాదాపు భారత ఎన్నారైలు  అత్యధికంగా ఉన్నారు. దాంతో ఈ ప్రభావం భారతీయులపై అత్యధికంగా ప్రభావం చూపిస్తోంది. ఉద్యోగులతో ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు ప్రస్తుతం కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్, లేదా వేతనాలు తగ్గించడం చేస్తున్నాయి. మరి ఇవన్నీ వీసా నిభంధనల ఉల్లంఘన క్రిందకి వస్తుందని కదా మరి ఈ విధంగా కూడా వారికి వీసా ముప్పు ఉందని అంటున్నారు నిపుణులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: