అవును.. నిజంగానే ఎన్నారైల‌కు ఇది శుభవార్త.. అమెరికాలోని భార‌తీయుల‌కు ట్రంప్ స‌ర్కార్ అందించిన తీపి క‌బురు ఇది.. ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. కరోనా వైరస్ కారణంగా చిక్కుల్లో పడిన ఎన్నారైల‌కు ట్రంప్ ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో భారీ ఊరట లభించింది.. అదేంటి అంటే? 

 

ఇటీవలే ట్రాంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారు క‌రోనా వైర‌స్ సంక్షోభం దృష్ట్యా సంబంధిత పత్రాలను సమర్పించాలి అని నోటీసులు జారీ చేసింది. ఇంకా ఆ ప‌త్రాలు అన్ని స‌మ‌ర్పించేందుకు 60 రోజులు గడువు ఇచ్చింది యూఎస్‌ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్. 

 

కాగా నోటీసు లో చెప్పినట్టు చివరి తేదీ తర్వాత 60 రోజులు వీరిపై ఎలాంటి చర్యలు ఉండవు అని.. ఇమిగ్రేషన్ అధికారులు చెప్పారు.. అయితే కరోనా వైరస్ ప్రభావం అమెరికాలో ఎలా విలయ తాండవం చేస్తుందో ప్రత్యేకంగా కిచెప్పాల్సిన అవసరం లేదు.. ఈ కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఇమ్మిగ్రేష‌న్ కార్యాల‌యాలు అన్ని పూర్తిగా మూతపడ్డాయి. దీంతో వీసా ప్ర‌క్రియలు పూర్తిగా నిలిచిపోయాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే వీసాదారులు ప‌త్రాల స‌మ‌ర్ప‌ణ‌లో ఇబ్బందులు ఎదుర్కొవ‌డంతో ట్రాంప్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.. కాగా ఇటీవల విదేశాల నుండి యూఎస్ వతడి చెయ్యడం కోసం ట్రాంప్ ప్రభుత్వం నిపిలివేసింది. ఏది ఏమైతేనేం ట్రాంప్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఎన్నారైల‌కు కొంత ఊర‌ట లభించింది.                                                                                                   

 

మరింత సమాచారం తెలుసుకోండి: