గత కొద్దికాలంగా కరోనా వైరస్ నేపథ్యంలో ఏ దేశంలోని ప్రజలు ఆ దేశంలో అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. దీనికి కారణం ప్రతి దేశం వేరే దేశాల నుంచి వచ్చే విమానాలను అనుమతించకపోవడం. ఇక అసలు విషయంలోకి వెళితే... ఇంగ్లాండ్ లో చిక్కుకున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం ఒక తీపి కబురు అందజేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో అన్ని ప్రాంతాల్లో విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.

 

IHG

దీంతో విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. ఇక ఇదే క్రమంలో వీసాల గడువు ముగిసినప్పటికీ బ్రిటన్ లో ఉండిపోయిన కొందరు భారతీయులకు ఇతర దేశ పౌరులకు అక్కడి ప్రభుత్వం కాస్త ఊరట ఇచ్చే అంశం ఒకటి తెలియజేసింది.

IHG

ఈ విషయంలో మే 31 వరకు అన్ని రకాల వీసా గడువును పొడిగిస్తూ ఆదేశం నిర్ణయం తీసుకుంది. ఇకపోతే అలా పొడిగించిన గడువు కాస్త దగ్గర పడడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు పై ఇంకా పునరుద్ధరణ చేయకపోవడంతో మరోసారి అన్నిరకాల వీసా గడువును బ్రిటన్ ప్రభుత్వం పొడిగించింది. అయితే ఇప్పుడు మరో రెండు నెలల పాటు వీసా గడువు ముగిసిన వారికి వీసా గడువు పెంచింది.

IHG

 

ఈ విషయాన్ని బ్రిటన్ హోం సెక్రటరీ ప్రీతి పటేల్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇంగ్లాండులో చిక్కుకుపోయిన విదేశీ పౌరుల వీసా గడువు జూలై 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీనితో ఆ దేశంలో ఇరుక్కుపోయిన వివిధ దేశాల ప్రజలకు ఈ వార్త చాలా మేరకు లబ్ధి చేకూరనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: