దేశంలో ఇప్పుడు కరోనా ఏ విధంగా ఇబ్బందులు పెడుతుంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 59 లక్షల 4 వేల 397 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29 లక్షల 62 వేల 865. ఇక ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 61 వేల 998 మంది వ్యక్తులు చనిపోయారు. వ్యాధి నుంచి 25 లక్షల 79 వేల 534 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రపంచంలో అరలక్షపైగా మరణాలు సంబవించాయి.. కోటిన్నరకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో దారణమైన విషయం ఏంటంటే అమెరికాలో మరణాలు, కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. ప్రస్తుతం రష్యాలో మరణ గంటికలు మోగుతున్నాయి. బ్రిటన్ లోనూ కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

 

ఈ నేపథ్యంలో ఓ డాక్టర్, నర్సు జంట ఆసుపత్రిలో ఉన్న ప్రార్థనామందిరంలోనే పెళ్లి చేసుకుంది. నర్సు పేరు జేన్ టిప్పింగ్ (34), డాక్టర్ పేరు అన్నలన్ నవరత్నం (30). జేన్ ఉత్తర ఐర్లాండ్ కు చెందిన అమ్మాయి కాగా, నవరత్నం శ్రీలంక జాతీయుడు. వీరిద్దరూ లండన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడుతూ వచ్చారు.  వీరి ప్రేమకు పెద్దలకు కూడా ఓకే అన్నారు.. కానీ కరోనా మాత్రం అడ్డు వచ్చింది.

 

ప్రేమలో పడిన జేన్, నవరత్నం వాస్తవానికి ఆగస్టులో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కరోనా సంక్షోభం వీరిని మరింత ముందే పెళ్లి చేసుకునేలా పురిగొల్పింది. ఉత్తర ఐర్లాండ్, శ్రీలంక నుంచి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వచ్చేందుకు వీలుకాకపోవడంతో ఈ జోడీ ఏప్రిల్ లో తమ ఆసుపత్రిలోనే ఉన్న చర్చిలో పెళ్లితో ఒక్కటైంది. ఈ పెళ్లిని ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆన్ లైన్ ద్వారా వీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: