అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా నల్లజాతీయులు చేస్తున్న నిరసనలు మిన్నంటుతున్నాయి. ఓ అమాయకుడిని అమానుషంగా చంపారు అంటూ నిరసన కారులు రోడ్లపైకి వచ్చి తెలుపుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఊహించని రీతిలో నిరసన కారులు అమెరికా వ్యాప్తంగా సుమారు 40 నగరాలలో అల్లర్లని ఉదృతం చేశారు. సుమారు 20 పోలీసు వాహనాలని దగ్ధం చేశారు. ఐ కాంట్ బ్రీత్ అని అతడు చివరి సారిగా మాట్లాడిన మాటల్ని తమ నిరసనకి కేంద్రంగా చేస్తూ అతడిని చంపిన పోలీసు అధికారిని తీవ్రంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇదిలాఉంటే..

IHG

నిరసన కారులు అమెరికాలోని షాపింగ్ మాల్స్ లోకి చొరబడుతున్నారు. అందిన కాడికి దోచుకుంటూ విలువైన వస్తువులు కాజేస్తున్నారు. మరో పక్క ప్రవైటు వాహనాలకి నిప్పు పెడుతున్నారు. పెట్రోల్ బాబులు, రాళ్ళతో దాడులు చేస్తున్నారు. కాలిఫోర్నియా, చికాగో, వంటి ప్రాంతాలలో కర్ఫ్యూ విధించినా టియర్ గ్యాస్ వదులుతున్నా సరే నిరసన కారులు లెక్క చేయడం లేదు. కాగా 

IHG's Death, Hurting U.S. Image ...

జార్జ్ ఫ్లాయిడ్  హత్యపై స్పందించిన మానవ హక్కుల సంఘాలు సైతం బగ్గు మంటున్నాయి. చనిపోతుంటే సాయం చేయలేని స్థితిలో అమెరికా పోలీసులు ఉన్నారా అంటూ మండిపడుతున్నారు. ఇదిలాఉంటే మరో పక్క నిరసన కారులని ఆపడం ఎవరి వల్లా కావడంలేదు. వారిని అడ్డుకోవడానికి అమెరికా సైన్యాన్ని దించక తప్పలేదు. నిన్నటి రోజున నిరసన కారులు వైట్ హౌస్ కి చేరువ అవ్వడంతో ఒక్క సారిగా వైట్ హౌస్ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ట్రంప్ ని వైట్ హౌస్ లో ఉన్న రహస్య బంకర్ లోకి తీసుకువెళ్ళి సుమారు గంట పాటు అక్కడే ఉంచారు. అమెరికా చరిత్రలో 1992 తరువాత సైన్యాన్ని దించడం ఇదే మొదటి కావడం అమెరికాలో ప్రస్తుత పరిస్థితి అద్దం పడుతోందని అంటున్నారు పరిశీలకులు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: