అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఘటనతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం నల్ల జాతీయులు మాత్రమే కాదు అమెరికా పౌరులు సైతం సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనలు రోజు రోజుకి ఉదృతం అవుతున్నాయి. ఏకంగా వైట్ హౌస్ ని ముట్టడి చేయడానికి నిరసన కారులు ప్రయత్నించడంతో ఒక్క సారిగా వైట్ హౌస్ వర్గాలు అలెర్ట్ అయ్యాయి. అధ్యక్షుడు ట్రంప్ ని వైట్ హౌస్ లో ఉన్న సీక్రెట్ బంకర్ లోకి తీసుకువెళ్ళారు. అయితే

IHG

ఈ ఘటన జరిగిన రోజు మొదలు వైట్ హౌస్ లో ఉన్న సీక్రెట్ బంకర్ గురించి అందరికి ఆశక్తి కలిగింది. అసలు ఆ బంకర్ ఎప్పుడు నిర్మితం అయ్యింది..ఎవరి హయాంలో రూపొందించారు..దాని ప్రత్యేకతలు ఏమిటి అనే ఆలోచనలో పడ్డారు.. అధ్యక్షుడుకి రక్షణగా నిలిచిన ఆ బంకర్ స్పెషాలిటీ ఏమిటి..?? అందులో ఎలాంటి సెక్యూరిటీ పరికరాలు ఉన్నాయి ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి అనే వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

IHG

సాధారణంగా ఉగ్రవాదుల దాడులు జరిగిన సందర్భంలో అధ్యక్షుడిని, ఆయన కుటుంభ సభ్యులని ఈ బంకర్ లోకి తెసుకువెళ్తారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకూ అధికారిక కార్యకలాపాలు అక్కడి నుంచే అధ్యక్షుడు చేపడుతారు. రెండో ప్రపంచ యుద్ద సమయంలో అంటే 1940 లో అప్పటి అధ్యక్షుడు రూజ్ వెల్డ్ హయాంలో ఆయన ఆదేశాల మేరకు  ఈ బంకర్ నిర్మించారు. ఆ తరువాత 1948 లో అప్పటి అధ్యక్షుడు హ్యారీ దీనిని విస్తరించారు. శ్వేతా సౌధం తూర్పు భాగంలో శత్రు దుర్భేధ్యమైన కట్టడంతో ఎంతో కట్టుదిట్టంగా అన్ని హంగులతో. అత్యంత అదునాతమైన టెక్నాలజీని ఉపయోగించి దీనిని నిర్మించారు. 2001 లో న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్రదాది జరిగిన సమయంలో అప్పటి అధ్యక్షుడు బుష్  తన సిబ్బందితో కలిసి ఈ బంకర్ లోనే తలదాచుకున్నారు. ఆ తరువాత ఒబామా ఎలాంటి పరిణామాలు జరిగినా బంకలో లోకి వెళ్ళిన సందర్భాలు లేవు. బుష్ తరువాత ట్రంప్ మళ్ళీ ఈ బంకర్ లో తలదాచుకున్నారు.

IHG

భూమి లోపలి సుమారు ఐదు అంతస్తుల లోతులో ఈ బంకర్ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. ఇందులోకి నీరు , ఆహరం, స్వచ్చమైన గాలి వచ్చేందుకు అన్ని మార్గాలు ఉన్నాయి. పూర్తిగా శత్రు దుర్భేద్యమైన ఈ బంకర్ అణు దాడిని సైతం తట్టుకునే శక్తిని కలిగి ఉందట. నెలల తరబడి ఉండేలా ఆహార నిల్వలు కలిగి ఉంటుందట. వైట్ హౌస్ నుంచీ ఈ బంకర్ కి రెండు సొరంగాలు ఉన్నాయట. వీటిలో ఒకటి ట్రెజరీ భవనానికి వెళ్తుందని. మరొకటి సౌత్ లాన్ కి వెళ్తుందని తెలుస్తోంది. అధ్యక్షుడు లేదా రక్షణ కీలక అధికారులు అక్కడి నుంచే ఆయుధాలని సంధించేలా టెక్నాలజీని అభివృద్ధి చేశారని ఇది పూర్తిగా అధ్యక్షుడి రక్షణ కోసం నిర్మించిన బంకర్ అని నిపుణులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: