అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ సంఘటన కరోనా చావుల కంటే కూడా అత్యంత విషాదకరమైన చావుగా నిలిచింది. కరోనా మిగిల్చిన వేడి ఇంకా చల్లారక ముందే. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి అమెరికాలో తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది. జాతి వివక్ష ఒక్క సారిగా మళ్ళీ జడలు విప్పిందా అనే సందేహాలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యంత కిరాతకంగా నరహంతకులు చేసే ప్రవర్తనలా అమెరికా పోలీసు అధికారి తన మోకాళ్ళ ని జార్జ్ మేడపై ఉంచి సుమారు 8.46 నిమిషాల పాటు ఉంచి చంపేయడంతో అమెరికా అట్టుడికింది. ఐ కాంట్ బ్రీత్ అంటూ చివరిగా అతడు మాట్లాడిన మాటలు ప్రపంచాన్ని కదిలించాయి..

 

జార్జ్ మృతికి కారణమైన పోలీసు అధికారి చెవెన్ సుమారు 8.46 నిమిషాల పాటు కళ్ళతో తొక్కి పట్టి చంపాడు అంతో విచారణంలో తేలడంతో నిరసన కారులు ఆ 8.46 సంఖ్యనే తమ నిరసనలకి నినాదంగా మార్చుకున్నారు. అయితే ఈ సమయాన్ని ఇంత ఖచ్చితంగా ఎలా నిర్ధారించారు అనేది తెలియకపోయినా ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా 8.46 అంటే జార్జ్ కోసం చేపట్టే నినాదమని అందరికి తెలుసు. ఆందోళన కారులకి ఈ నినాదం గుండెల్లో పాతుకు పోయింది.

 

బోస్టన్, టోకామా , వాషింగ్టన్ లలో పెద్ద ఎత్తున జరిగిన నిరసనల శాంతియుత ప్రదర్సనలు 8.46 నిమిషాల పాటు నిర్వహించారు. చేతిలో కొవ్వత్తులు పట్టుకుని అమెరికా ప్రజలు ఎంతో మంది మోకాళ్ళపై మోకరిల్లి ప్రార్ధనలు చేశారు. హ్యూస్టన్ చర్చి లో ప్రార్ధనలు చేపట్టిన ఎంతో మంది ప్రజలు తమ చేతులో కొవ్వత్తులు ఉంచుకుని మోకాళ్ళపై పాకుతూ నిరసన వ్యక్తం చేయడంతో ఈ 8.46 కు మరింత ప్రాధాన్యత ఇచ్చింది. అంతేకాదు అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రజలు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు సైతం 8.46 నిమిషాల పాటు గౌరవ సూచికంగా ప్రార్ధనలు చేస్తున్నారు. అమెరికాలోని టీవీ ఛానళ్ళు సైతం 8.46 నిమిషాల పాటు తమ ప్రసారాలని నిలిపివేసి సంఘీభావం తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: