అమెరికాలో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ ఓడిపోనున్నారా..?? ఏ అధ్యక్షుడూ చూడని ఓటమిని ట్రంప్ చూడనున్నారా అంటే అవుననే అంటున్నాయి తాజాగా సర్వేలు. అమెరికాలో ఎన్నికలు మరో 5 నెలలలో జరగనున్న నేపధ్యంలో చేపడుతున్న సర్వేలు ట్రంప్ లో గుబులు రేపుతున్నాయని అంటున్నారు. అధ్యక్షుడిగా ఈ సారి ప్రమాణ స్వీకారం చేయబోయేది డెమోక్రటిక్  పార్టీ అభ్యర్ధిగా ఉన్న బిడెన్ అని తేల్చి చెప్తున్నాయి. ఇంతకీ అమెరికాలో చేపట్టిన సర్వేలు ఏమి చెప్తున్నాయి..ఏ విషయాలని పరిగణలోకి తీసుకున్నారు..అసలు అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారు అనే వివరాలలోకి వెళ్తే.

 

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ పార్టీల భవిష్యత్తుపై, అధికార పార్టీ పని తీరుపై సర్వేలు జరగడం ప్రజాభిప్రాయం సీకరించడం పరిపాటే. ప్రపంచంలో ఎక్కడినా ఇలాంటి సర్వేలు జరుగుతూనే ఉంటాయి. అలాగే అమెరికాలో ట్రంప్ పని తీరుపై, మళ్ళీ అధికారం ఎవరికీ కట్టబెట్టాలని అనుకుంటున్నారు అనే కొన్ని కీలక అంశాలపై సర్వే జరిగింది. ఈ సర్వేలో దాదాపు 80 శాతం మంది ప్రజలు అమెరికాలో ప్రజలు తప్పుదోవ పట్టారు..అమెరికా గతంలో ఎప్పుడూ ఇలా లేదు మేము చూడలేదు పరిస్థితులు అదుపుతప్పాయి అంటూ తమ అభిప్రాయాలని వెల్లడించారట. అంతేకాదు

 

ట్రంప్ వ్యవహార శైలిపై ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని తెలుస్తోంది. ట్రంప్ హుందాగా నడుచుకోలేదని, తనని ఎదిరించిన వారిని ఉద్యోగాల నుంచీ తొలగించడం, ఇష్ట వచ్చినట్లుగా అమెరికాపై ఇతర దేశాలకి విసుగు కలిగేలా వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ ప్రజలు సహించలేక పోతున్నారట. ముఖ్యంగా కరోనా లాంటి సమయంలో లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి ట్రంప్ అసమర్ధతే కారణమని అంటున్నారు. మరీముఖ్యంగా తాజాగా జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తరువాత ట్రంప్ ప్రవర్తనా తీరు అతడు అధ్యక్షుడిగా కొనసాగడానికి అర్హుడు కాడని తేలిపోయిందని మండిపడుతున్నారు.అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోవడం, ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నం కావడం కేవలం ట్రంప్ అలసత్వం వలన జరిగిందని అమెరికా ప్రజలు బలంగా నమ్ముతున్నట్లుగా సదరు సర్వే ప్రకటించింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: