నిధి నిక్షేపాలు అనగానే మనకి ట్రెజర్ హంట్ సినిమాలే గుర్తుకు వస్తాయి. అందులో హీరో ఓ మ్యాప్ తీసుకుని నిధుల కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతడిని అనుసరిస్తూ మరొక గ్యాంగ్ వెళ్తుంది. ఈ మద్యలో హీరోయిన్ ని భందించో మరో కారణంగానో హీరోని బ్లాక్ మెయిల్ చేస్తూ రౌడీ వర్గం ఆ నిధిని మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. కొండలు గుట్టలు ఎక్కుతూ , అడివి మనుషులు, క్రూర జంతువులు, నిధి రక్షణ కోసం ఏర్పాటు చేయబడిన వివిధ ప్లాన్స్ అన్నీ దాటుకుంటూ నిధిని సొంతం చేసుకుంటాడు హీరో...

IHG's Hidden Treasure. Have ...

ఇలాంటి సంఘటనలు వస్తవ జీవితంలో జరుగుతాయి కాబట్టే సినిమాలుగా రూప కల్పన అవుతుంది. ప్రస్తుతం ఇలాంటి సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఎంతో కష్టతరంగా నిధిని కనిపెట్టాడు. అంతేకాదు అందుకోసం ఎంతో కష్టాలు పడ్డాడు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఏకంగా ఆ వ్యక్తి 2 మిలియన్ డాలర్ల విలువగల నిధిని గుర్తించాడు. ఈ నిధిని గుర్తించడానికి అతడికి సుమారు 10 ఏళ్ళ సమయం పట్టిందనే చెప్పాలి.

IHG

న్యూ మెక్సికో కి చెందిన ఫెన్ అనే పురాతన వస్తువులని సేకరించే ఓ వ్యక్తి ఓ రాగిపెట్టేలో బంగారు వస్తువులు, రాగి వస్తువులు బంగారపు ముద్దలు లాంటివి అన్నీ కలిపి ఓ పెట్టెలో పెట్టి 10 ఏళ్ళ క్రితమే దాచిపెట్టాడు. ఆ తరువాత నిధి వేటకు అవసరమైన క్లూస్ ని ది థ్రిల్ ఆఫ్ ది చీజ్ పుస్తకం పేరుతో ఆవిష్కరించాడు. సుమారు 24 లైన్ల తో కూడిన ఓ పద్యంలో క్లూని ఉంచాడు. దాంతో కొన్నేళ్లుగా ఈ నిధిని కనుగొనడానికి వేలాది మంది వేటని మొదలు పెట్టారు. కొందరు ఉద్యోగాలు మానేసి మరీ ఈ నిధి అన్వేషణలు పడ్డారు. అయితే రాకీ పర్వతల వద్ద సముద్ర మట్టానికి సుమారు 5000 వేల అడుగుల ఎత్తులో ఈ నిధిని ఓ వ్యక్తి కనుగొన్నట్టుగా ఫెన్ తెలిపాడు. అతడి పేరుని తెలుపలేదు. ఈ నిధిని దాచిన పెట్టె బరువు 9 కేజీలు ఉంటుందని అందులోని వస్తువుల బరువు 10 కేజీలు ఉంటాయని ఫెన్ తెలిపాడు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: