అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటే అందరూ కామెడీ యాంగిల్ లోనే ఊహించుకుంటారు. అసలు ఇంత తింగర  ప్రవర్తన కలిగిన వాడు ఎలా అమెరికా అధ్యక్షుడు అయ్యాడనుకుంటారు. ఇలాంటి వాడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారేంటి అమెరికన్స్ అనుకుంటారు. వాస్తవానికి ట్రంప్ ఎంతో సరదాగా ఉండే వ్యక్తి మాత్రమే. తన చుట్టూ ఉండే సిబ్బందితో కానీ లేదా..అధికారులతో కానీ ఎంతో జోవియల్ గా ఉంటాడని అంటుంటారు. అలాగే తన మాటకి ఎదురు చెప్పే ఎలాంటి వారినైనా సహించక పోవడం ట్రంప్ కి అతిపెద్ద మైనస్ అనే చెప్పాలి. కానీ ఓ ప్రణాలికా బద్దంగా ట్రంప్ వెళ్ళరు అనే అపకీర్తిని మాత్రం ట్రంప్ మూటగట్టుకున్నారు...అయితే

 

తాజాగా ట్రంప్ ఎన్నడూ కనపడిన విధంగా ఎంతో రౌద్రంగా కనిపించారు. సినిమాలో హీరోలు డైలాగులు చెప్పినట్టుగా ఏ సెంటర్ అయినా సరే చూసుకుందాం అనే రేంజ్ లో రెచ్చి పోయి మరీ ప్రత్యర్ధులపై మాటల యుద్ధం చేశారు. ట్రంప్ సహజ శైలికి భిన్నంగా సాగిన ఈ మాటల యుద్ధం ఒక్క సారిగా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తిందనే చెప్పాలి. ఒక్లాహామాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ ప్రత్యర్ధి పార్టీ పై ఓ రేంజ్ లో విరుచుకు పడ్డారు. డెమోక్రటి పార్టీ తనని తోలు బొమ్మ అన్న కారణంగా ట్రంప్ ఆవేశంతో ఊగిపోయారు.

 

 

జో బిడెన్ అనే వ్యక్తి అమెరికాకి అధ్యక్షుడు అవ్వాలని అనుకుంటున్నాడు. కానీ అతడి నిజస్వరూపం మీకు తెలిస్తే ఓట్లు వేయరు. అతడు రాడికల్ లెఫ్ట్ చేతుల్లో కీలు బొమ్మ వాళ్ళు చెప్పినట్టు ఆడాలి లేదంటే అధ్యక్ష పదవిలోకి ఎంట్రీ లేదు అతడికి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లెఫ్ట్ పార్టీ అమెరికా ప్రజలతో ఆదుకోవాలని ఎదురు చూస్తోంది. నేను ఉన్నంత వరకూ అది జరగదు..అధికారం వాళ్లకి కట్టబెట్టే ప్రయత్నాలని తిప్పి కొడుతాను అంటూ ఫైర్ అయ్యారు. మన అమెరికా చరిత్ర కళ్ళకి కట్టినట్టు కనపడే ఆనవాళ్లని వాళ్ళు కొల్ల గొడుతున్నారు. మన సంపదని దోచేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసు వ్యవస్థని కనుమరుగు చేయాలనీ అనుకుంటున్నారు.  ఇవన్నీ మనం ఎదుర్కోవాలంటే బిడెన్ ఎట్టి పరిస్థితులలో అధికారంలోకి రాకూడదు అంటూ సెంటిమెంట్ తో అమెరికా ప్రజలకి ఊగిపోతూ ప్రసంగాలు చేశాడు. ఈ ప్రసంగాలు విన్న అమెరికన్స్ అందరూ ట్రంప్ వైపు ఆకర్షించబడ్డారని అంటున్నారు పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: