కరోనా వైరస్.. ప్రపంచాన్ని నాశనం చేసింది. ప్రపంచ దేశాలను గాగడలాడించిన ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది. అయితే కొన్ని లక్షల మందిని తీసుకెళ్లిన ఈ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు భారత దేశమంతా లాక్ డౌన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది వలసకార్మికులు ఉపాధి లేక.. తిండి లేక ఇబ్బందులు పడ్డారు.

 

అయితే మన భారత్ లో ఉన్న వారే అన్ని ఇబ్బందులు పడితే ఇంకా పక్క దేశాలలో చిక్కుకున్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి ఉండాలి. అలానే లాక్ డౌన్ కారణంగా పాకిస్థాన్ లో చిక్కుకున్న భారతీయులు విడతల వారీగా భారత్ కు చేసుకుంటున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌లో ఉన్న తమ బంధువులను చూడటానికి వెళ్లిన దాదాపు 748 మంది భారతీయులు లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయారు. 

 

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడంపై దృష్టిపెట్టిన భారత ప్రభుత్వం.. ''వందే భారత్ మిషన్''ను ప్రారంభించింది. అలానే పాక్‌లో చిక్కుకున్న వారిని ఇండియాకు తరలించేందుకు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 748 మంది భారతీయులను 25 - 27 మధ్య మూడు విడతల్లో భారత్ కు పంపేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. 

 

ఇంకా ఈ నేపథ్యంలో వాగా సరిహద్దు ద్వారా సుమారు 248 మంది భారతీయులు భారత్ కు చేరుకున్నారు. మరో 250 మంది నిన్న స్వదేశానికి చేరారు. కాగా దాదాపు 250 మంది భారతీయులను శనివారం రోజు ఇండియాకు తరలిస్తున్నట్టు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. కాగా పాక్ నుండి భారత్ కు చేరిన భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.                         

మరింత సమాచారం తెలుసుకోండి: