కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచాన్నే సర్వనాశనం చేస్తుంది. రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు అత్యంత భారీగా పెరిగిపోతున్నాయి. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేశాయ్. లాక్ డౌన్ సమయంలో తగ్గినట్టు కనిపించిన ఈ కరోనా కేసులు ఇప్పుడు ప్రపంచం అంత భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.                 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అమెరికాలో, బ్రెజిల్‌లో ఈ కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. అమెరికాలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే రోజుకు 40 కేసులుపైగా నమోదవుతుండగా.. నిన్న ఒక్కరోజే 51 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.. ఇంకా బ్రెజిల్ లో అంతే రోజుకు 30 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఇంకా ఇప్పుడు నిన్న ఒక్క రోజే బ్రెజిల్‌లో 44 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.         

 

నిన్న ఒకటే రోజు ఈ రెండు దేశాల్లో కలిపి 95 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని టెక్సాస్‌లో అత్యధికంగా 8 వేలకుపైగా కేసులు నమోదవ్వగా.. కాలిఫోర్నియా, ఫ్లోరిడాలలో 6 వేలకుపైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇంకా బ్రెజిల్ కేవలం 44వేళా కేసులు మాత్రమే నమోదవ్వడం కాదు ఆ కేసులతో పాటు కరోనాకు నిన్న ఒక్క రోజే వెయ్యి మందికిపైగా బలయ్యారు.                   

 

అమెరికాలో కరోనా కాటుకు 600మందికిపైగా మృత్యువాత పడ్డారు. దీంతో అమెరికాలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1.30లక్షలకు చేరగా.. 27.77లక్షల కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 14.53లక్షల కరోనా కేసులు నమోదవ్వగా 60 వేల మందికిపైగా ఈ కరోనాకు బలయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: