భారత దేశం నుంచీ ఎంతో మంది వివిధ దేశాలకి ఉద్యోగ, వ్యాపార రీత్యా వలసలు వెళ్ళారు. అలా వెళ్ళిన భారతీయులలో కొందరు  భారత దేశం గర్వించె విధంగా, భారతీయులు అందరూ స్పూర్తి పొందే విధంగా..యవాత్ ప్రవంచం ఆదర్శంగా తీసుకునేలా ఉన్నత స్థానాలకి చేరుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అగ్ర రాజ్యమని చెప్పుకునే అమెరికాని ఆస్థాయిలో నిలిపింది కేవలం భారతీయులేనని చెప్పడంలో ఆలోచించాల్సిన  అవసరం లేదు. అక్కడ వివిధ వ్యాపారాలలో స్థిరపడి ఎంతో మంది అమెరికన్స్ కి ఉపాది అందిస్తున్నారు మన భారతీయులు..

 

భారత సంతతికి చెందిన ఎన్నారై ఇండియా స్పోరా అధినేత ,సిలికాన్ వ్యాలీ కి చెందిన  వ్యాపారవేత్త రంగ స్వామి దాదాపు 11 దేశాలలో సుమారు భారత సంతతికి చెందిన 58 మంది వివిధ వ్యాపారాలలో కీలక స్థానాలని అధిరోహించారని లక్షల కోట్ల టర్నోవర్ లతో ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నారని ఇండియా స్పోరా సంస్థ చేపట్టిన సర్వే నివేదిక తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత సంతతి వ్యక్తులు కార్పోరేట్ లో మనదైన శైలిలో దూసుకుపోతున్నారని తెలిపింది.

 

వీరి సారధ్యంలో ఉన్న కంపెనీలు సుమారు 23 శాతం లాభాలని ఆర్జించాయని, ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగాన్ని అభివృద్ధి పదంలో నడపగల సత్తా ఉన్న 58 మంది భారతీయులు ఇప్పుడు అత్యంత కీలకంగా మారారని తెలిపారు రంగ స్వామి. ఇలా విజయాలు సాధించిన వారిలో ముందు వరుసలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ , మాస్టర్ కార్డ్ సిఈవో  అజయ్ బంగా, వేర్టేక్స్ ఫార్మా ఎండీ, సిఈవో అయిన రేష్మా రమణి ఉన్నారు. మరి కొందరు భారత సంతతికి చెందిన సీఈవో లు అలాగే వివిధ దేశాలలో ఉన్న భారత సంతతి వ్యక్తులు ఈ లిస్టు లో ఉన్నారని, కేవలం అభివృద్ధి పరంగానే కాకుండా సేవా రంగంలో కూడా వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని  రంగ స్వామి ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: