అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నవంబర్ లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఒక వైపు ప్రత్యర్ధి పార్టీ ఇస్తున్న గట్టి పోటీ మరోకవైపు కరోనా మిగిల్చిన నష్టంతో మల్లగుల్లాలు పడుతున్న ట్రంప్ ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ట్రంప్ పర్యటనలో భాగంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ విమానాశ్రయంలో ట్రంప్ విమానం ల్యాండ్ అవ్వుతున్న సమయంలో విమానానికి కుడి వైపుగా అత్యంత సమీపం నుంచీ ఓ డ్రోన్ వేగంగా దూసుకు వెళ్లిందని ఆ డ్రోన్ పసుపు ,నలుపు రంగులో ఉందని విమానంలో ప్రయాణించిన మిగిలిన వారు తెలిపారు. అయితే
ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఫెడరల్ ఏవియేషన్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అధికారులు అప్రమత్తం అయ్యారని తెలిపారు. అసలు అమెరికా అధ్యక్షుడు విమానానికి ఎలాంటి విమానం, డ్రోన్ రావాలన్నా తప్పకుండా అనుమతులు ఉండాలని అసలు అంత దగ్గరగా ఆ డ్రోన్ ఎలా వచ్చిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విమానాన్ని డీ కొట్టడమే లక్ష్యంగా డ్రోన్ ని ప్రయోగించారా..?? లేక కాకతాళీయంగా డ్రోన్ వచ్చిందా అనే కోణంలో దర్య్తాప్టు ప్రారంభిచారు. ఇదిలాఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ సంఘటన జరగడంతో ట్రంప్ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి