విదేశాలకు వెళ్ళి స్థిరపడిన చాలామంది భారత్ లో  పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అక్కడ ఆదాయం ఎక్కువగా ఉండటం ఇక్కడ ధరలు తక్కువగా ఉండటంతో ఎక్కువ భూములు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  విదేశాలకు వెళ్ళిన చాలా మంది ఇక్కడ బంగారం కొనడం లేదా భూములు కొనడం ఎక్కువగా చేస్తారు.  రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. లేకపోతే డబ్బులు దాచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

అయితే గత కొంత కాలంగా భారత్ లో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశం లో ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితులు కనబడటమే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత ఏర్పడటం కూడా కారణం అవుతోంది. ఇక ఇప్పుడు ఈ సమయంలో చాలా మంది ఎన్నారైలు భారత్ లో  పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతుంది. భారత్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే కరోనా వైరస్ ఏ మాత్రం కూడా తగ్గే అవకాశం లేదు.

 ఇక చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి కొన్ని ఇబ్బందులు పెడుతూ వస్తోంది. మధ్యప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక బీహార్ సహ కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. దీనితో ఎన్ఆర్ఐలు భారత్ లో  పెట్టుబడులు పెట్టేందుకు ఎంత మాత్రం కూడా ఆసక్తి చూపించడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు భారత్ లో  పెరిగాయని దీని పై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పెట్టుబడులు పెట్టిన అంత స్వేచ్ఛా వాతావరణం ఇప్పుడు అసలు కనపడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పుడు చాలా మంది పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. మరి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయి పరిస్థితులు అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: