ఇతర దేశాల్లో ఉన్న ఎన్నారైలు చాలా మంది వ్యాపారాలు ఎక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్న ఎన్నారై లు ఇప్పుడు ఉద్యోగాల కంటే కూడా వ్యాపారాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. యూరప్ సహా అనేక దేశాల్లో ఎన్నారైలు వ్యాపారాల మీద ఫోకస్ చేస్తున్నారు. దుబాయ్ సహా గల్ఫ్ దేశాల్లో వ్యాపారాలు చేయడానికి రెడీ అవుతున్నారు. యూరప్ లో ఇప్పుడు చాలా మంది ఎన్నారైలు వ్యాపారాలు స్థాపించారు. అటు అమెరికాలో కూడా వ్యాపారాలు స్థాపించడానికి రెడీ అవుతున్నారు.

చైనాలో కూడా కొన్ని వ్యాపారాలు మన వాళ్ళవి మొదలయ్యాయి అని తెలుస్తుంది. ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎన్నారైలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎన్నారైలు చాలా మంది ఇప్పుడు రియల్ వ్యాపారం మీద భారీగా పెట్టుబడి పెడుతున్నారు అని టాక్. అమెరికాలో కూడా ఎన్నారైలు ఈ వ్యాపారాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారని తెలుస్తుంది.  ఇందుకోసం ఇండియాలో ఉన్న ఆస్తులను అమ్మేసి అక్కడ కొనుగోలు చేయాలనీ చూస్తున్నారు.

ఇక హోటల్ వ్యాపారంలో కూడా ఎన్నారైలు ఎక్కువగా ఆసక్తిగా ఉన్నారు అని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా యూరప్ దేశాల్లో  పర్యాటక రంగం చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఎన్నారైలు అక్కడ ఎక్కువగా వ్యాపారాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా హోటల్ రంగం అయితే బాగుంటుంది అని బావించి హోటల్స్ ని కొనుగోలు చేయడం లేదా లీజుకి తీసుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది ఏంటీ అనేది చూడాలి. కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వేలాది మంది ఎన్నారైలు ఇప్పుడు రోడ్డున పడిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరి వ్యాపారాల్లో ఎలా సక్సెస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: