గతంలో యూరప్ దేశాల్లో స్థిరపడటానికి పెద్దగా ఆసక్తి చూపించే వారు కాదు. కాని ఇప్పుడు మాత్రం యూరప్ దేశాల్లో మన దేశానికి చెందిన ఎందరో స్థిరపడుతున్నారు. అక్కడి ప్రభుత్వాలు కూడా అనేక రాయితీలు ప్రకటించడం, విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావడంతో మన వారు యూరప్ దేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. విద్యార్ధులు, ఉద్యోగులు యూరప్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలను వెతుకుతూ అక్కడికే వెళ్తున్నారు. యూరప్ దేశాల్లో ఉండే వారికి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అక్కడి ప్రభుత్వం అండగా ఉంటుంది.

అందుకే ఇప్పుడు అమెరికా నుంచి ఎన్నారైలు మొత్తం కూడా యూరప్ దేశాలకు వెళ్తున్నారు. యూరప్ దేశాల్లో అవకాశాలు పెరుగుతున్న నేపధ్యంలో ఐటి ఉద్యోగులు సహా పలువురు ఆయా దేశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడి అగ్ర ఐటి కంపెనీలు కూడా  ఇప్పుడు మన వారి కోసం అనేక ఆఫర్లను కూడా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న కంపెనీలు కూడా మన వారి కోసం మంచి ఆఫర్లు ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటలీ, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పుడు మన దేశం వారిని ఆకట్టుకోవడానికి కొత్త ఉద్యోగాలకు ఆఫర్ చేస్తున్నాయి.

అంతే కాదు...  చైనా, సహా రష్యాలో ఉండే వైద్యులకు కూడా ఇప్పుడు ఆఫర్లు ప్రకటించడం గమనార్హం. వేలాది మంది ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. వారికి అందరకి యూరప్ దేశాలు స్వాగతం పలుకుతున్నాయి. ఇటలీ సహా కొన్ని దేశాల్లో యువత చాలా తక్కువగా ఉన్నారు. దీనితో అక్కడి కంపెనీలు మన  యువతకు గాలం వేస్తున్నాయి. కెనడా సహా మెక్సికో దేశాలు కూడా మన వారికి ఆహ్వానం అందిస్తున్నాయి. దీని ద్వారా ఆయా దేశాల్లో నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చే విధంగా మన వారిని వాడుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: