మోసాల విషయంలో ఎన్ని ఘటనలు  జరుగుతున్నా కొంత మందిలో మాత్రం మార్పు రావడం లేదు. ఎన్ని విధాలుగా హెచ్చరించినా సరే కొందరు ఇష్టం వచ్చినట్టు ఎవరితో ఒకరితో సంబంధాలు పెట్టుకుని నాశనం అవుతున్నారు.  పెళ్ళికి డబ్బులకు ఆశ పడి నాశనం అవుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజు వెలుగులోకి వస్తూనే ఉన్నా ప్రజల్లో మాత్రం మార్పు అనేది అసలు రావడం లేదు.  ముఖ్యంగా సైబర్ నేరాల విషయంలో ఎప్పుడు కూడా ఏదొకటి జరుగుతూనే ఉంది. అయినా సరే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఎవరు అయినా డబ్బులు అడిగితే వెంటనే వెనుకా ముందు  చూసుకోకుండా ఇచ్చేస్తున్నారు. దీని ఫలితంగా ఆర్ధికంగా చాలా మంది నష్టపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట ఏదోక ఘటన ప్రతీ రోజు వెలుగులోకి వస్తూనే ఉంది అనే చెప్పాలి. పోలీసులు ఎన్ని విధాలుగా హెచ్చరించినా సరే మార్పు అనేది రావడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలో పెళ్ళి పేరుతో ఓ యువతి మోసం చేసింది. అమెరికా లో ఉంటున్న తెనాలి యువకుడికి గాలం వేసారు. నెల రోజులుగా అబ్బాయి ని మాటలతో ముగ్గులోకి దించిన యువతి... మ్యాట్రీమోని లో మైనేని సముద్ర గా పరిచయం  చేసుకుంది.

తల్లిదండ్రులు మద్రాస్ యూనివర్శిటీ లో ప్రొఫెసర్ గా పరిచయం చేసుకుంది. నిన్న (21) పెళ్లి చూపులు, 24 న పసుపు కుంకుమ పెట్టుకుందామని నమ్మించింది. ఈ లోగా నగలు, చీరలు కొనుగోలు కు 7.20 లక్షలు అకౌంట్ లో వేయించుకుంది. నిన్న రోజు పెళ్లి చూపులకు ప్రకాశం జిల్లా ఉలవపాడు వెళ్లి అబ్బాయి కుటుంబంకు షాక్ తగిలింది. ఉదయం నుంచి ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసింది సదరు యువతీ. గ్రామం మొత్తం వాకాబు చేసి మోసపోయామని గ్రహించింది అబ్బాయి కుటుంబం. యువతి మోసం పై పోలీసులను ఆశ్రయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: